KTR vs CM Ramesh: సీఎం రమేశ్.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ఎంపీ.. 2024లో బీజేపీ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అంతకు ముందు టీడీపీలో ఉన్నారు. ఇక సీఎం రమేశ్ మొదటి నుంచి ఏ1 కాంట్రాక్టర్. అనేక కంపెనీలు ఉన్నాయి. తాజాగా అనకాపల్లి ఎంపీకి.. సిరిసిల్ల ఎమ్మెల్యే.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయుడు.. మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు మధ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఒక రోడ్ కాంట్రాక్ట్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకున్న విషయాన్ని ఆధారంగా చేసుకుని కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సీఎం రమేష్ మధ్య లింక్ పెట్టి విమర్శలు చేస్తున్నారు.
Also Read: ఆస్కార్.. భాస్కర్.. ఆ ఒక్క మాటతో రేవంత్ ను ఆడుకున్న కేటీఆర్
ఏంటి వివాదం..?
రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్త హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఒక రోడ్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ సంస్థ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు చెందినది. ఈ కాంట్రాక్టు కూడా కాంపిటీటివ్ టెండర్ ప్రక్రియ ద్వారానే రిత్విక్ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. కానీ, తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగల్చాలి.. కాబట్టి.. రేవంత్, సీఎం రమేశ్‌కు లింకు పెట్టి విమర్శలు చేస్తున్నారు. దీని ఆధారంగా రచ్చ మొదలు పెట్టారు. ఒక బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందని పేర్కొంటున్నారు. తద్వారా కాంగ్రెస్, బీజేపీ దోస్తీ అనే మెస్సేజ్‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టడానికి సీఎం రమేశ్ సహకరించారని అనుకుంటున్నారు. ఫలితంగా ప్యూచర్ సిటీ కాంట్రాక్టు సీఎం రమేశ్ కంపెనీకి గిఫ్ట్‌గా ఇచ్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
లాజిక్ లేని వాదన..
కేటీఆర్ ఆరోపణలకు కనీస లాజిక్ లేకుండా పోయినట్లుగా కనిపిస్తోంది. సీఎం రమేష్ వ్యక్తిగత హోదా లేదా వ్యాపారాలు ఈ వ్యవహారంలో ఎలా సహకరించాయో చెప్పలేకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ. గతంలో సీఎం రమేశ్ తన సామాజికవర్గం సహకరిస్తుందని కొన్ని అంశాల్లో కేటీఆర్ సాయం అడిగారని, కానీ ఆయన అహంకారం వల్ల సహకారం అందలేదని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయాలి కాబట్టి.. మనకు కలిసి వస్తుందని ఏది పడితే అది మాట్లాడితే విమర్శలు తప్పవు. కానీ, తెలివైన కేటీఆర్.. ఇటీవల సహనం కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రతీ విషయంలో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: ఆ తెలంగాణ పత్రిక సర్వర్ హ్యాక్.. దీని వెనక ఎవరి హస్తం ఉందో?
మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న కోపాన్ని.. కేటీఆర్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌పై చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు కేటీఆర్‌కు మంచి చేయకపోగా.. ఆయన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేయడం ఖాయం.