Telangana Newspaper Hack: ఒకప్పుడు తెలంగాణలో ఆపత్రిక ఆడింది ఆట. పాడింది పాట. పది సంవత్సరాలపాటు చెలరేగిపోయింది.. పేజీలకు పేజీలు వార్తలను డంపు చేసేది. కుమ్మి పారేసేది. ఏకపక్షంగా వార్తలు రాసి కొంతమంది మెప్పును పొందేది. ఇప్పుడు ఆ పత్రిక ప్రాభవం గత చరిత్ర అయిపోయింది. ఒకప్పటిలాగా పేజీలకు పేజీలు వార్తలను ప్రచురించడం లేదు. చాలామంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఉన్నవారి మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి పని చేయిస్తోంది. అసలే అంపశయ్య మీద ఉన్న ఆ పత్రికకు ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది..
Also Read: కేసీఆర్, కేటీఆర్.. వాళ్ల కుటుంబం.. పాపం కవిత లేదు!
కొద్దిరోజులుగా ఆ పత్రికలో పనిచేసే సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయాలకు వెళ్తున్నారు. వాస్తవానికి పత్రికలలో పనిచేసే సిబ్బంది సాయంత్రం 5 గంటలకు విధులకు వెళ్తారు. అర్ధరాత్రి 12 తర్వాత ఇంటికి వస్తారు. కానీ ఈ పత్రిక సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటలకే వెళుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై ఆరా తీస్తే ఆసక్తికరమైన సమాధానం వెలుగులోకి వచ్చింది.. దీంతో అసలు విషయం ఇదా అని అర్థమయిపోయింది.
ఆ పత్రిక ఎఫ్టీపీ (సొంత నెట్వర్క్ వ్యవస్థ) ని కొంతమంది హ్యాకర్లు హ్యాక్ చేశారు. తమ కోరినంత డబ్బు ఇస్తేనే వదిలివేస్తామని ప్రకటించారు. అసలే ఇప్పుడు ఆ పత్రిక పరిస్థితి బాగోలేదు. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. ఇలాంటి స్థితిలో హ్యాకర్లకు ఆ స్థాయిలో డబ్బు ఇవ్వాలంటే కుదిరి పని కాదు. పైగా ఆ పత్రికలో మేనేజ్మెంట్ కంటే.. మిడిల్ మేనేజ్మెంట్ పెత్తనం ఎక్కువైపోయింది. ఫలితంగా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులకు ఒక సర్కులర్ విడుదల చేసింది.. మధ్యాహ్నం రెండు గంటలకే జిల్లా కార్యాలయాల సిబ్బంది, కేంద్ర కార్యాలయ సిబ్బంది విధుల్లోకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. పైగా విలేకరుల నుంచి వార్తలను మెయిల్ ద్వారా మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపసంపాదకులు మెయిల్ ద్వారా వార్తలను స్వీకరించి.. వాటిని ఎడిట్ చేసి.. పేజీలలో పెడుతున్నారు. కేంద్ర కార్యాలయ సిబ్బంది కూడా అదే పని చేస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా ఆ పత్రికలో పనిచేసే సిబ్బంది సిబ్బంది పడుతున్నారు. మూడు గంటలకంటే ముందు విధుల్లోకి వెళ్లి.. రాత్రి 12 గంటలకు వస్తున్నారు. అదనపు పని భారం వల్ల తాము తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని సిబ్బంది చెబుతున్నారు.
Also Read: కేటీఆర్.. ఇంత అసహనమా?
మరోవైపు ఎఫ్.టి.పి హ్యాకర్ల బారిన పడటంతో ఆ పత్రిక అంతర్గత వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదని తెలుస్తోంది. కీలకమైన ఫైల్స్ మొత్తం హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఈ పని ఎవరు చేసి ఉంటారు.. ఈ పని చేయడం వల్ల వారికి వచ్చిన లాభం ఏంటి అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లభించాల్సి ఉంది. గతంలో కూడా ఓ పత్రిక ఎఫ్టిపి ఇలానే హ్యాకర్ల బారిన పడింది. అయితే ఆ తర్వాత ఆ పత్రిక యాజమాన్యం ఫైర్ వాల్స్ ను సమర్థవంతంగా అభివృద్ధి చేయడంతో మరోసారి ఆ సమస్య ఎదురు కాలేదు. అయితే ఈ పత్రికకు ఆ స్థాయిలో ఫైర్ వాల్స్ లేవని తెలుస్తోంది. అందువల్లే ఇలా హ్యాకర్ల బారిన పడినట్టు సమాచారం.. అయితే కొత్తగా ఎఫ్ టి పి ని ఏర్పాటు చేసుకుంటారా… లేకుంటే ఇలానే ఉద్యోగులతో చాకిరి చేయించుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.