https://oktelugu.com/

Media Head: విదేశాలకు మీడియా అధినేత.. ఉన్నట్టుండి ఎందుకు వెళ్లినట్టు?

ప్రతి ఆదివారం ఆ మీడియా అధినేత వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ రాస్తారు. అందులో తను అభిమానించే నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తనకు నచ్చని రాజకీయ పార్టీని ఇష్టానుసారంగా విమర్శిస్తుంటారు. అయితే ఈ ఆదివారం ఆయన విశ్లేషణ తన పత్రికలో కనిపించలేదు. కారణం ఏంటా అని ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగు చూసాయి..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 27, 2024 / 02:22 PM IST

    Media Head

    Follow us on

    Media Head: శనివారం ఆంధ్రప్రదేశ్లో ఆ మీడియా అధిపతి సంస్థలో పనిచేసే ఒక కీలకమైన వ్యక్తి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ రకరకాలుగా చర్చలు జరిగాయి. కొంతకాలంగా ఆ మీడియా అధినేత వ్యవహార శైలి పట్ల ఆ సంస్థ ఉద్యోగులు పలు విధాలుగా చెవులు కోరుకుంటున్నారు. శనివారం కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది. వాస్తవానికి ఆ శుభకార్యానికి ఆ మీడియా అధినేత హాజరు కావాల్సి ఉండేది. అయితే అనుకోకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోయారట. ఉన్నట్టుండి ఆయన విదేశాలకు వెళ్లిపోవడం ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఆశ్చర్యాన్ని కలిగించిందట.. ఏం జరిగిందని వారిలో వారే ఆరా తీసుకున్నారు. అయితే ఆ మీడియా అధినేత కొంతకాలంగా ఇంటికి వెళ్లడం లేదు. సతి వియోగం జరిగిన తర్వాత ఆయన ఓ వైద్యురాలితో సహజీవనం చేస్తున్నారు. పైగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆమెతో కలిసి ఉంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యుల ముందు ఒక ప్రతిపాదన ఉంచితే.. దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో ఆయన అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. తన పత్రికా కార్యాలయానికి కూడా వెళ్లడం లేదు.

    అనారోగ్యానికి గురయ్యారట..

    ఇతరుల జీవితాల్లో స్పై కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టి చూసే ఆ మీడియా అధినేత.. తన వ్యవహారం మీడియా సర్కిళ్లల్లో నానుతుండడంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయారట. పైగా ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారట. అయితే ఇక్కడ చికిత్స చేస్తే తగ్గని వ్యాధి అట. అందువల్లే ఆయనతో సహా జీవనం చేస్తున్న ఆ వైద్యురాలు విదేశాలకు తీసుకెళ్లిందట. ఆయన కుటుంబ సభ్యులు కనీసం విమానాశ్రయం దగ్గరికి కూడా వెళ్లలేదట. డ్రైవర్ తోని విమానాశ్రయం దాకా వెళ్ళిన ఆయన.. ఆ వైద్యురాలితో కలిసి విదేశాలకు వెళ్లిపోయారట.. అయితే ఇటీవల ఆ మీడియా అధినేత నిర్మిస్తున్న భారీ భవనానికి సంబంధించిన చర్చ కుటుంబ సభ్యుల మధ్య జరిగిందట. అది ఎవరికి దక్కాలనే విషయంపై తర్జనభజన చోటుచేసుకుందట. ఆ భవనం విభజన సహేతుకంగా జరిగితేనే ఆయన రెండో పెళ్లికి ఒప్పుకుంటామని కుటుంబ సభ్యులు అల్టిమేటం ఇచ్చారట. అయితే ఈ విషయంపై ఆ మీడియా అధినేత ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. రెండవ పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. పైగా ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్లడం.. ఆ వైద్యురాలితో కలిసి వెళ్లడం రకరకాల చర్చలకు కారణమవుతోంది.. ఒకప్పుడు ఇతరుల జీవితాలను తన పత్రికలో, తన చానల్లో ఇష్టానుసారంగా చూయించిన ఆ మీడియా అధినేత.. ఇప్పుడు తనే మీడియాకు ఒక మసాలా ఐటమ్ అయిపోయాడు. పాపం దీనినే విధి వైచిత్రి అంటారు కాబోలు.