https://oktelugu.com/

Media Head: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఇప్పుడు పెళ్లి.. మూడుముళ్ల బంధం తో ఒక్కటైన మీడియా టైకూన్!

తెలుగు మీడియాలో సంచలనం! మీడియా టైకూన్ గా పేరుపొందిన ఆయన ఒక ఇంటివాడయ్యాడు. అలాగని ఆయన వయసేమీ పాతికేళ్లు కాదు. ఆరుపదుల వయసులో.. షష్టిపూర్తి జరుపుకోవాల్సిన వయసులో రెండవ వివాహం చేసుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 23, 2024 / 04:10 PM IST

    Media Head

    Follow us on

    Media Head: ఉదయం లేస్తే ఆ మీడియా అధిపతి చెప్పే సుద్దులు మామూలుగా ఉండవు. తన పత్రికలో రాసే రాతలకు అడ్డు అదుపు ఉండదు. తన చానల్లో ప్రవచించే నీతి వాక్యాలకు హద్దులు ఉండవు. అలాంటి మీడియా అధిపతి లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. వాస్తవానికి ఈయనకు గతంలోనే వివాహం జరిగింది. మొదటి భార్య ద్వారా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ పత్రిక అధిపతి నెలకొల్పిన మీడియా సంస్థల్లో వారిద్దరు పనిచేస్తున్నారు. కుమార్తె భర్త కూడా ఇదే సంస్థలో ఉన్నాడు. కుమారుడి భార్య కూడా తన మీడియా సంస్థల్లోనే కీలకమైన శాఖను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూస్తే మీడియా అధిపతి కుటుంబం తన సంస్థలను పర్యవేక్షిస్తోంది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఆ మీడియా అధిపతి సతీమణి అనారోగ్యంతో కన్నుమూసింది. నాటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. అయితే తన సతీమణి అనారోగ్యం బారినపడిన సమయంలోనే.. ఆయన ఓ మహిళ డాక్టర్ తో ప్రేమలో పడ్డారని.. తన సతీమణి చనిపోయిన తర్వాత ఆమెతో సహజీవనం మొదలుపెట్టారని తెలుస్తోంది. శంషాబాద్ కు సమీపంలోని ఓ ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నారని సమాచారం.

    వివాహం చేసుకున్నారు

    ఆ మీడియా అధిపతి ఆ మహిళ డాక్టర్ ను సోమవారం వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.. మొదట్లో ఆ మీడియా అధిపతి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదని సమాచారం. ఆ మీడియా అధిపతి జూబ్లీహిల్స్ ప్రాంతంలో 250 కోట్లతో ఓ భవనం నిర్మిస్తున్నారని.. ఆ భవనానికి సంబంధించి ఆ మీడియా అధిపతి కుమారుడు, కుమార్తె మధ్య వివాదం నెలకొందని.. అందువల్లే ఆ మీడియా అధిపతి వివాహానికి వారు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. మొత్తానికి ఆ భవనం వివాదం పరిష్కారం కావడంతో ఆ మీడియా అధిపతి వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.. ఆమె కూడా ఆ మీడియా అధిపతి సామాజిక వర్గానికి చెందిన వారని.. గతంలో కేంద్రంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి సమీప బంధువు అని తెలుస్తోంది. సామాజిక వర్గం అంటే చెవి కోసుకునే ఆ మీడియా అధిపతి.. తన సామాజిక వర్గానికి చెందిన మహిళ డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారని సమాచారం. మొత్తానికి లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి.. దానిని వివాహ బంధం వరకు ఆ మీడియా అధిపతి తీసుకెళ్లడం తెలుగు మీడియాలో సంచలనంగా మారింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఇతరుల జీవితాలను భూతద్దాలు పెట్టి చూసిన ఆ మీడియా అధిపతి.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.