https://oktelugu.com/

Upasana: రేణు దేశాయ్ కి భారీ ఆర్ధిక సాయం చేసిన ఉపాసన..కన్నీళ్లతో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్!

రామ్ చరణ్ ఎంతో ఇష్టంగా పెంచుకునే రైమ్ అనే శునకం పేరుతో ఈ విరాళం ని అందించింది ఉపాసన. దీని గురించి ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ఉపాసన ని ట్యాగ్ చేస్తూ 'అంబులెన్స్ కొనుగోలు చేయడానికి విశాల హృదయంతో విరాళం అందించిన రైమ్ కి కృతజ్ఞతలు ' అని స్టోరీ లో చెప్పుకొచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 27, 2024 2:26 pm
    Upasana

    Upasana

    Follow us on

    Upasana: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ ఉండే వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఇంస్టాగ్రామ్ లో ఈమె ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మాత్రమే కాకుండా, సోషల్ సర్వీస్ గురించి నెటిజెన్స్ కి అవగాహనా కల్పిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేసింది. ముఖ్యంగా ముఖ్యంగా మూగ జీవాల మీద ఈమె చూపించే ప్రేమ మామూలుది కాదు. రీసెంట్ గానే ఈమె మూగ జీవాల కోసం ‘శ్రీ ఆద్య ఎనిమల్ షెల్టర్’ అనే NGO సంస్థ ని ప్రారంభించింది. ఈ NGO కి విరాళాలు సేకరిస్తూ పశు సంరక్షణ కోసం ఉపయోగిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఇటీవలే ఆమెకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ సంస్థ కి ఒక అంబులెన్స్ ని విరాళంగా ఇచ్చింది.

    రామ్ చరణ్ ఎంతో ఇష్టంగా పెంచుకునే రైమ్ అనే శునకం పేరుతో ఈ విరాళం ని అందించింది ఉపాసన. దీని గురించి ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ఉపాసన ని ట్యాగ్ చేస్తూ ‘అంబులెన్స్ కొనుగోలు చేయడానికి విశాల హృదయంతో విరాళం అందించిన రైమ్ కి కృతజ్ఞతలు ‘ అని స్టోరీ లో చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. చిన్నతనం నుండి రేణు దేశాయ్ కి మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం. వాటికి చిన్న గాయమైన ఈమె తట్టుకోలేదు. వాటి సంరక్షణ కోసం తాను నడుం బిగించి NGO ని ప్రారంభించడమే కాకుండా, తనని అనుసరించే వారిని కూడా వాటి సంరక్షణ కోసం పాటు పడేలా ప్రేరేపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్.

    కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఆమె ఈ NGO ని ప్రారంభించాలని అనుకుంది. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన కి కూడా మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సింగపూర్ లోని మేడం తుస్సాడ్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టేందుకు కొలతలు తీసుకొని వెళ్లారు. రామ్ చరణ్ తనతో పాటు, తాను ఇష్టం గా పెంచుకుంటున్న రైమ్ శునకం కూడా తన చేతిలో ఉండేలా విగ్రహం తయారు చేయాలనీ రిక్వెస్ట్ చేసాడు. ఆయన రిక్వెస్ట్ ని అంగీకరించిన మ్యూజియం నిర్వాహకులు, రామ్ చరణ్ రైమ్ ని చేతిలో పెట్టుకొని స్టైల్ గా కూర్చున్న మైనపు విగ్రహాన్ని, మేడం తుస్సాడ్స్ మ్యూజియం లోని ‘మోనాలిసా’ విగ్రహం పక్కనే పెట్టనున్నారు. తనతో పాటు తన శునకాన్ని కూడా అంతటి గౌరవం దక్కేలా చేసాడు రామ్ చరణ్. అందుకే రేణు దేశాయ్ NGO కి ప్రత్యేకంగా ఉపాసన చేత అంబులెన్స్ ఇప్పించాడు. ఇలాంటివి రామ్ చరణ్ చాలానే చేస్తాడు కానీ, బయటకి తెలియనివ్వకపోవడం అతని గొప్పతనం.