2025 Hindu Marriage Dates: తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఆషాఢ మాసం తరువాత శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. 2025 ఏడాదిలో జూలై 24న ఆషాఢమాసం ముగుస్తుంది. 25 నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైందని కొందరు అంటారు. ఇక నుంచి ప్రతి నెలలో ముఖ్యమైన పండుగలు రానున్నాయి. ఇదే సమయంలో శుభముహూర్తాలు ఉండనున్నాయి. ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు కొనసాగిన శుభముహూర్తాలు.. ఆ తరువాత ఆషాఢ మాసం ప్రారంభం తో శుభముహూర్తాలు లేకుండాపోయాయి. దీంతో కొన్ని శుభకార్యక్రమాలు, వివాహాలు నిర్వహించలేకపోయారు. శ్రావణమాసం రాగానే వీటిని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ఏడాది వివాహాలకు, శుభ కార్యక్రమాలు ఏ రోజన ఉన్నాయో చూద్దాం..
శ్రావణమాసం మాసంలో భక్తులు ఎంతో నిష్టతో ఉంటారు. ఈ మాసం మొత్తం పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఎలాంటి మాంసం, మద్యం ముట్టకుండా ఉంటారు. అలాగే ఈ నెలలో కొన్ని శుభముహూర్తాలు ఉంటారు. జూలై నెలలో 26వ తేదీ నుంచే శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. 26తో పాటు 30, 31 రోజులు మంచిరోజులుగా ఉన్నాయి. అలాగే ఆగస్టు నెలలో 1,3,5,7,8,9, 10,11,12,13,14,17 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని జాతకం తెలుపుతోంది. సెప్టెంబర్ నెలలో 24,26,27,28 రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అక్టోబర్ నెలలో 1,2,3,4,8,10,11,12,22,24,29, 30,31 తేదీలు శుభంగా ఉండనున్నాయి. అలాగే నవంబర్ నెలలో 1,2,7,8,12,13,15,22,23,26,27, 29,30 తేదీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకోవచ్చని తెలుస్తోంది.
అయితే వివాహ కార్యక్రమాలు నిర్వహించుకునేవారు ఆయా తేదీలను నిర్ణయించుకొని పండితులను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే వివాహ కార్యక్రమం వారి జాతకాలను భట్టి ఏ తేదీల్లో ముహూర్తం బాగుంటుందో వారి జాతకాన్ని భట్టి నిర్ణయిస్తారు. అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు.. ఇతర శుభకార్యక్రమాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు ఆయా తేదీల్లో నిర్వహించుకోవచ్చని కొందరు పండితులు తెలుపుతున్నారు. గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకునేవారు సైతం ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి.
Also Read: ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!
ఈ ఏడాది ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 40 రోజుల పాటు మంచి రోజులు ఉండనున్నాయి. దీంతో ఈసారి వివాహాలు పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచిరోజులు తక్కువగా ఉండడంతో ఆయా తేదీల్లో కుదరలేదు. ఈసారి పెద్ద మొత్తంలో శుభముహూర్తాలు రావడంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని అనుకునేవారు.. కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారు సైతం ఆయా తేదీల్లో సిద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
శ్రావణమాసం ప్రారంభం కావడంతో శుభముహూర్తాలు మాత్రమే కాకుండా పండుగలు కూడా ప్రారంభం అవుతాయి. ఆగస్టు నెలలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగ రానుంది. ఇదే నెలలో మంగళ గౌరీ వ్రతం కూడా చేయనున్నారు. ఆ తరువాత 27న వినాయక చవితి రానుంది. అక్టోబర్ 2న దసరా పండుగ నిర్వహించుకోనున్నారు. అక్టోబర్ 18న దీపావళి వేడుకలు నిర్వహించుకోనున్నారు.