MLC Kavitha Bonala Celebrations: సరిగ్గా ఏడాది క్రితం ఢిల్లీ స్కాన్ లో అభియోగాలు ఎదుర్కొంటూ భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల జైలుకు వెళ్లారు. దాదాపు 6 నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద ఉన్నారు. అప్పట్లో ఆమె జైల్లో ఉన్నప్పుడు.. జైలు నుంచి విడుదలైనప్పుడు గులాబీ మీడియా విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. ఏకంగా “తలవంచదు తెలంగాణ” అనే శీర్షికతో బ్యానర్ కథనాన్ని ప్రచురించింది.. అంతేకాదు టీ న్యూస్ లో అయితే బీభత్సంగా స్టోరీలను టెలికాస్ట్ చేసింది.. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో కవరేజ్ ఇచ్చింది. ఎప్పుడైతే కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అవడం మొదలుపెట్టిందో అప్పటినుంచి గులాబీ మీడియా ఆమెను దూరం పెట్టింది.
Also Read: చీపురు చేతబట్టి.. ఆలయాన్ని కడిగి.. ‘బాబు’ గారు మారిపోయారు
ఇటీవల ఆమె రాసినట్టుగా మీడియాకు విడుదలైన లేఖలను గులాబీ మీడియా కావాలని ఇగ్నోర్ చేసింది. పైగా అవన్నీ కూడా రేవంత్ రెడ్డి దృష్టి అన్నట్టుగా ఉల్టా దబాయింపుకు దిగింది.. చివరికి ఆ లేఖలు రాసిందే నేనే అని కవిత చెప్పడంతో గులాబీ మీడియా నాలుక కర్చుకుంది. ఇక అనేక పర్యాయాలు తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశాలు నిర్వహించినప్పుడు.. గులాబీ మీడియా వాటికి పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదు. చివరికి గులాబీ పార్టీ అధినేత ను కాలేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ధర్నా చేస్తే.. దానికి కూడా గులాబీ మీడియా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు.. ఇక ఇటీవల కల్వకుంట్ల కవిత పై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కూడా గులాబీ మీడియా పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి చేస్తే దానిని కూడా ఒక వార్తలాగా గులాబీ మీడియా చూడలేదు. కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశ నిర్వహిస్తే దానికి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.
ప్రస్తుతం తెలంగాణలో బోనాల పండుగ జరుగుతున్నది. ఆదివారం అమ్మవారికి కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులూ ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించేవారు.. పైగా అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించేవారు. కానీ ఈసారి ఆమె బోనం ఎత్తుకొని వస్తే శ్రీనివాస్ యాదవ్ కనిపించలేదు. ఆయన కుమారుడు కూడా దర్శనమివ్వలేదు. మునుపటి హంగామా లేదు. టీ న్యూస్ లో లైవ్ లేదు. నమస్తే తెలంగాణలో వార్త లేదు. పైగా బంగారు బోనం స్థానంలో కల్వకుంట్ల కవిత మట్టి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.. ఏ ఆంధ్ర మీడియా అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నారో.. చివరికి ఆ మీడియానే కల్వకుంట్ల కవితకు దిక్కు అయింది. టీ న్యూస్ పట్టించుకోకపోయినా.. నమస్తే తెలంగాణ దృష్టిలో పెట్టుకోకపోయినా.. మిగతా మీడియా సంస్థలు ఆమెకు కవరేజ్ ఇచ్చాయి.. కానీ ఇదే సమయంలో గులాబీ మీడియా ఎక్కడో కేరళలో కేటీఆర్ ఏదో కార్యక్రమానికి హాజరైతే దానిని లైవ్ టెలికాస్ట్ ఇచ్చాయి.. దీనిని బట్టి పార్టీలో కేటీఆర్ కు, కల్వకుంట్ల కవితకు ఇలాంటివి విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
చార్మినార్ పరిధి మీరాలం మండి మహాకాలేశ్వర ఆలయంలో బోనం సమర్పించిన కవిత https://t.co/jVbBqjkp4N pic.twitter.com/FqjiGgRtI2
— ChotaNews App (@ChotaNewsApp) July 20, 2025