https://oktelugu.com/

Bandi Sanjay Vs Ponnam Prabhakar: బండి సంజయ్ తో పొన్నం కు ఆ గొడవేంటి.. అసలు ఏం జరిగింది?

తల్లి పేరు తీసింది సంజయ్‌.. నేనెప్పుడూ కూడా తీయలేదని అన్నారు. కరీంనగర్‌ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు బీజేపీ ప్రభుత్వం రాముని పేరుతో ఓట్లు అడుక్కుంటున్నారని, బిచ్చగాడిగా మారాడని అన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 28, 2024 / 03:45 PM IST
    Follow us on

    Bandi Sanjay Vs Ponnam Prabhakar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను కాంగ్రెస్‌ నేత, మంత్రి పొన్నం పొట్టుపొట్టు తిట్టారు. ఓ వెధవ, బిచ్చగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ఏదైనా అంటే ఆత్మాహుతి చేసుకుంటానని అన్నారు. బండి సంజయ్‌ కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హుస్నాబాద్‌ వెళ్లిన బండి సంజయ్‌ అక్కడ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. రాముడి గురించి ప్రస్తావించారు. దీంతో పొన్న బుధవారం(ఫిబ్రవరి 28న) వేములవాడ నియోజకవర్గంలో నాంపల్లి గుట్టపై ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌తో కలిసి పొన్నం మాట్లాడారు.

    తల్లి పేరు ప్రస్తావిస్తావా?
    తల్లి పేరు తీసింది సంజయ్‌.. నేనెప్పుడూ కూడా తీయలేదని అన్నారు. కరీంనగర్‌ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు బీజేపీ ప్రభుత్వం రాముని పేరుతో ఓట్లు అడుక్కుంటున్నారని, బిచ్చగాడిగా మారాడని అన్నారు. ఆయన ఓ వెదవ తల్లి పేరు తీస్తావా.. తల్లిని అవమానిస్తావా అంటూ మండిపడ్డారు. బతికి ఉన్న తల్లిని పట్టుకుని ఆత్మఘోషిస్తుందని అంటావ అని ఫైర్‌ అయ్యాడు.

    నీలా మూర్ఖున్ని కాదు..
    ఇప్పటికే కరీంనగర్‌ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఓడిపోయిన బండి సంజయ్‌ ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్‌ విసరడాన్ని పొన్నం తప్పు పట్టారు. ఇక, రాముని గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. రాముని గురించి మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధమన్నారు. నీ అంత మూర్ఖున్ని కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం చేసిన వ్యాఖ్యలను పొన్నం గుర్తు చేశారు. ఎంపీగా బండి సంజయ్‌ ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు.

    నీకన్నా ముందే ఎంపీని..
    అంతే కాకుండా తాను బండి సంజయ్‌కన్నా ముందే ఎంపీగా గెలిచానని, మార్కెఫెడ్‌ చైర్మన్‌గా పనిచేశారని తెలిపారు. తాను దయతలిస్తే బండి సంజయ్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ అయ్యాడని పేర్కొన్నారు. బిడ్డా జాగ్రత్త.. అని హెచ్చరించారు.