Credit Card: నేటి కాలంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంటోంది. వారి వారి ఆర్థిక వ్యవహారాల ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్లు చేస్తున్నాయి. అయితే వీటిపై ఎంతో కొంత చార్జి పడుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డును వాడడం వల్ల పెట్రోల్ బంకుల్లో, ఫోన్ రీచార్జ్ చేసుకుంటే అదనంగా కన్వినెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి అదనంగా ఛార్జీలు లేని క్రెడిట్ కావాలని తప్పకుండా అనుకుంటారు. అయితే ఓ బ్యాంకు ఎలాంటి ఆన్యువల్ ఛార్జీలతో పాటు కన్వీనెన్స్ ఫీజును వసూలు చేయకుండా వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏ బ్యాంకు కార్డో తెలుసుకుందాం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకున్నా.. ఏదైనా వస్తువు కొనాలనుకున్నా.. పెట్రోల్ బంకుల్లోనూ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తన్నారు. కానీ అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా కొన్ని బ్యాంకులు ఫ్యూయెల్ వంటి వాటికి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా మొబైల్ రీచార్జ్ చేయాలనుకున్నా కన్వీనెన్స్ ఫీజు పెరిట అదనంగా వసూలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో వినియోగదారులను ఆకర్షిస్తోంది యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంకు నుంచి కొత్త కార్డు అందుబాటులోకి వచ్చింది. అదే Myzone Credit Card. ఈ క్రెడిట్ కార్డు ద్వారా సంవత్సరానికి రూ.12000 ఆదా చేసుకోవచ్చు. ఈ కార్డు పై సినిమా టికెట్ బుక్ చేసుకుంటే ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ ను ప్రకటించింది. అంటే ఒక టికెట్ కాస్ట్ రూ.200 ఉంటే మరో రూ.200 సేఫ్ అవుతుంది. ఇది ప్రతి నెలకు ఒకసారి ఆఫర్ ఉంటుంది. అంటే ఏడాదికి రూ.1200 సేవ్ అవుతుంది.
ఈ కార్డు ద్వారా Ajioలో రూ.3000 వర్త్ షాపింగ్ చేస్తే ఇందులో రూ.1000 వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఏడాదికి నాలుగు సార్లు ఉంటుంది. అంటే రూ.4000 వరకు ఆదా చేసుకోవచ్చు. స్విగ్గీలో ఈ కార్డు ద్వారా బుక్ చేస్తే ఇయర్ కు 2880 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ బంకుల్లో ఈ కార్డుపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ఇలా వివిధ ఆఫర్ల కింద మొత్తంగా సంవత్సరానికి రూ.12000 వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు.