CM Revanth Reddy: తెలంగాణ రాజధానికి ప్రపంచస్థాకి తీసుకురావడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. ఫలితంగా అనేక సంస్థలు ఇక్కడకు వచ్చాయి. ఏడాది క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది దావోస్(Davos)లో జరిగిన సదస్సుకు వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు. అనేక కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో హైటెక్ సిటీ సీఐఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సంచలన వ్యాఖ్యలు…
హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, క్యాబ్‌లు, ఆలోటను తరలిస్తామని పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న డీజిల్ వాహనాలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలిస్తామని తలిపారు. ప్రభుత్వం ఫోర్ట్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించబోతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య నివారణకు 3,200 ఈవీ బస్సులు తెచ్చామన్నారు. ఈవీ(EV) వాహనాలకు రోడ్డు టాక్స్(Road Tax), రిజిస్ట్రేషన్ పన్నులు మినహాయించామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ(Green enargy)ని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. నగరంలో 55 కిలోమీటర్ల మూసీ నది పునరుజ్జీవన ఆర్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 20250 నాటికి మంచినీటి వసతి కల్పిస్తామన్నారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, ఓఆర్‌ఆర్(ORR), ట్రిపుల్ ఆర్ మధ్యలో రేడియల్, లింకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఇక తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధి గురించి చర్చించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం – రేవంత్ రెడ్డి pic.twitter.com/OxXEgrqoxb
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025