https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ సినిమాలోని కొన్ని సీన్స్ ను ఆ ఇద్దరు దర్శకులు తెరకెక్కించారా..? ఇంతకీ ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఎవరంటే..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపుని సంపాదించుకున్న శంకర్ తనదైన రీతిలో తెలుగు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక 2024 సంవత్సరంలో 'భారతీయుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన :భారతీయుడు 2' డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2025 / 04:13 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer: ఇక ‘రామ్ చరణ్ ‘ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి డివైడ్ టాక్ అయితే వస్తుంది. మరి ఏది ఏమైనా కూడా శంకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో కొంతవరకు తడబడుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో శంకర్ కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లను శంకర్ డైరెక్షన్ చేయలేదు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక అందులో ఒకరు ‘హిట్ ‘సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘శైలేష్ కొలన్’ కాగా, మరొకరు స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి కావడం విశేషం… అయితే శంకర్ ‘భారతీయుడు 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ సినిమాలోనూ కొన్ని షాట్స్ ని ఈ ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి శంకర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట…

    అంటే సినిమా మధ్యలో వచ్చే క్రౌడ్ కి సంబంధించిన విజువల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కు సంబంధించిన విజువల్స్, అలాగే ట్రాఫిక్ కి సంబంధించిన విజువల్స్ మొత్తాన్ని వీళ్లే చిత్రీకరించారట. ఇక ఇందులో చిన్న చిన్న సీన్స్ ని కూడా వీళ్ళు చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ ఇద్దరు దర్శకులు కూడా దిల్ రాజ్ కి చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరితోనే ఆ సీన్స్ ని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి దిల్ రాజు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగినప్పటికి ఆయనకు ఈ సినిమా విషయంలో భారీగా నష్టం అయితే వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఈ సినిమా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో దిల్ రాజు మరికొంత జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

    కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా మంచి వసూళ్లను రాబడుతుందనే అంచనాలో దిల్ రాజ్ అయితే ఉన్నాడు… అయితే ఈ దర్శకులతో కొన్ని సీన్స్ ని చిత్రీకరించడం వల్ల శంకర్ కొంతవరకు అప్సెట్ అయినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీని వల్ల ఈ సినిమా ఫలితం మీద ఏమైనా తేడా కొట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…