Gayatri Pump House: ఈ పని ముందు చేసుంటే కరువు వచ్చేది కాదు కదా రేవంత్ సార్!

గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి స్పందించింది. ఆ పార్టీ కార్య నిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 2, 2024 10:43 am

Gayatri Pump House

Follow us on

Gayatri Pump House: గాయత్రి పంప్ హౌస్ నుంచి సోమవారం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంతో.. కాల్వల్లో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఆ నీటితో చెరువులను నింపుతున్నారు. కొన్నిచోట్ల పంట పొలాలకు మళ్లిస్తున్నారు. గత ఏడాది అంతంత మాత్రం గానే వర్షాలు కురవడం.. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురవడం.. కొన్ని చెరువులకు గండ్లు పడితే.. మరికొన్ని చెరువుల్లో నీళ్లు స్వల్పంగానే చేరాయి. దీంతో యాసంగి సాగుకు ప్రతిబంధకం ఏర్పడింది. వరి పంట ఏపుగా పెరిగే సమయంలో నీరు సరిగా అందుకు పోవడంతో ఎండిపోయింది. కొన్నిచోట్ల ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. సాగునీరు ఇవ్వాలంటూ ధర్నాలు చేశారు.

ఈ వార్తలను ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా ప్రముఖంగా ఫోకస్ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉండడం.. వరుసగా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం.. లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కావడం.. వంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చారు. దేవరప్పుల మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తుంగతుర్తి మండలం లోనూ వరి పొలాలను సందర్శించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ” మాపై కోపం ఉంటే తీర్చుకోండి. అంతేగాని రైతుల పొట్ట కొట్టొద్దు. గోదావరి జలాలు విడుదల చేసి రైతుల పొలాలను కాపాడండి” అంటూ కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పర్యటన మరుసటిరోజే ప్రభుత్వం స్పందించింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ నీరు పంట పొలాలకు మళ్ళుతోంది. చెరువులను నింపుతోంది.

గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి స్పందించింది. ఆ పార్టీ కార్య నిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. ” కాళే శ్వరం ఎత్తిపోతల పథకాన్ని వృధా అన్నారు. ఎందుకూ పనికిరాదని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ పథకం ద్వారానే నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. చెరువులు నింపుతున్నారు. పంట పొలాలకు సరఫరా చేస్తున్నారు. కేసీఆర్ పర్యటనతో ప్రభుత్వంలో చలనం కలిగిందని” కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రైతుల నుంచి హర్షత్ డే కాల్ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని రైతులు ఆందోళన చేశారు. సాగునీరు సరఫరా చేయాలంటూ రోడ్డెక్కారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కరీంనగర్ కాకుండా జనగామ జిల్లా దేవరుప్పుల, సూర్యాపేట జిల్లా లో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. ఒక రైతుకు 5 లక్షల ఆర్థిక సహాయం చేశారు.