Mumbai Indians: ఐపిఎల్ లో ఒకప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ పేరు చెబితే ప్రత్యర్థి జట్లు వణికి పోయేవి… వీళ్లతో మ్యాచ్ ఆడాలంటే ఏ టీమైన సరే చాలా కసరత్తులను చేస్తూ బరిలోకి దిగేది. ఫైనల్ గా ఆయా టీమ్ లు ముంబై చేతిలో ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేవి..ఇక ఇలాంటి క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలిచి వాళ్ళకి తిరుగులేదు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. కానీ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆట తీరు చూస్తుంటే మాత్రం ముంబై ఇండియన్స్ టీమ్ ఎందుకు ఇంత చెత్త పర్ఫామెన్స్ ని ఇస్తుంది అనే ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరికీ రాక తప్పదు. ఇక ఒకప్పుడు ఈ టీమ్ ను చూసి భయపడిన జట్లే ఇప్పుడు ఈ టీమ్ ని దారుణంగా ఓడిస్తున్నాయి.
ఇక దీనికి కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకొని హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్ గా రావడమే అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ముంబై ఇండియన్స్ టీమ్ లో ప్లేయర్లు సమిష్టిగా ఆడటం లేదు. అలాగే వాళ్లలో పోరాట తత్త్వం అనేది కనిపించడం లేదు. అందువల్లే ఈ టీమ్ అనేది చాలా వీక్ గా మారి ఫైనల్ గా ఓటమిని చవిచూడాల్సి వస్తుందని చెప్పేవారు కూడా ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇండియన్ మాజీ ప్లేయర్ అయిన ‘సునీల్ గవాస్కర్’ మాట్లాడుతూ రోహిత్ శర్మ ,పాండ్యలు ఎవరు కెప్టెన్ గా చేసిన కూడా టీమ్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం మరొకటి ఉంది. ఈ టీంలో బలమైన ప్లేయర్ అయిన సూర్య కుమార్ యాదవ్ టీం నుంచి దూరం అవడం వల్లే ముంబై ఇండియన్స్ కి భారీ కష్టాలు అనేవి వచ్చాయి. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే ప్లేయర్ కావడం వల్ల ఆయన లేని లోటు ఈ టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా గాయం కారణంగా టీమ్ కి దూరమైన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన ఫిట్ నెస్ ని ప్రూవ్ చేసుకొని టీమ్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్ కి ఒక గేమ్ చేజర్ల పని చేస్తాడు. కాబట్టి టీమ్ ఎటువంటి పరిస్థితిల్లో ఉన్నా కూడా దాన్ని విజయతీరాలకు చేర్చడంలో ఆయన చాలావరకు ప్రయత్నం అయితే చేస్తాడు.
అంటూ సురేష్ కుమార్ యాదవ్ మీద ప్రశంశల వర్షం కురిపిస్తూనే ఆయన లేకపోవడం వల్లే ముంబై వరుస ఓటములను చవిచూడాల్సి వస్తుందంటూ తెలియజేశాడు. ఇక రీసెంట్ గా రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచ్ లో ముంబై ప్లేయర్లు ఎవరు కూడా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చలేదు. దిగ్గజ బ్యాట్స్ మెన్స్ అందరూ చేతులెత్తేయడం అలాగే టీం కి భారీ నష్టాన్ని కలిగించిందనే చెప్పాలి. రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుతూ రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ లో తనదగ్గరికి వచ్చే బాల్ ని హిట్టింగ్ చేస్తూన్నాడు. లైన్ కి అవతలిగా వెళ్లే బాల్ ను ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన బౌలర్లకు దొరికిపోతూ ఉంటాడనే చెప్పాలి…