Warangal Cool Drink Poison: ఏ ముహూర్తంలో మేఘాలయ ఘటన చోటు చేసుకుందో.. అప్పటినుంచి దేశవ్యాప్తంగా భర్తలకు మంచి రోజులు లేవు. ప్రియుళ్ళ అండ చూసుకొని కొంతమంది భార్యలు దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు సినిమాలకు మించి ఉంటున్నాయి. థ్రిల్లర్ సినిమాలకు మించి ట్విస్టులు ఉంటున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య సినిమా తరహాలో అంతం చేసింది. ఈ ఘటన భవాని కుంట తండాలో జరిగింది.
భవాని కుంట తండాకు చెందిన బాలాజీ, కాంతి భార్యాభర్తలు.. బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉంది. బాలాజీ తరచూ కాంతిని కొడుతూ ఉండేవాడు. శారీరకంగా వేధిస్తూ ఉండేవాడు. అతని బాధలు భరించలేక కాంతి బావ దస్రూ కు దగ్గరయింది. ఈ విషయం బాలాజీకి తెలిసింది. దీంతో కాంతిని అతడు మరింత వేధించడం ప్రారంభించాడు. దీంతో కాంతి తన బావతో ఈ విషయం చెప్పింది. దీంతో వారిద్దరూ బాలాజీ అడ్డు లేకుండా చూసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం కాంతి బాలాజీకి గడ్డి మందు కల్పిన కూల్ డ్రింక్ ఇచ్చింది. దానిని లిక్కర్ లో కలుపుకొని తాగాలని సూచించింది. దానికి బాలాజీ ఒప్పుకున్నాడు. ఆ కూల్ డ్రింక్ లిక్కర్లో కలుపుకొని తాగాడు. లిక్కర్ తాగిన తర్వాత గొంతు మండుతోందని అరిచాడు.
Also Read:Revanth Reddy Chandrababu: గురుశిష్యులు.. ఢిల్లీలో కలిశారు.. సయోధ్యనా? సమరమా?
ఇదంతా తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భావించి కాంతి తన బావ దస్రూ ఇంటికి వెళ్ళిపోయింది. బాలాజీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇంటిపక్కల వారు అతడిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో బాలాజీ తండ్రి హరిచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కాంతిని.. ఆమె బావ దస్రూ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంతి చుట్టుపక్కల వారు విలేకరులతో మాట్లాడారు.. వారు మాట్లాడిన మాటలు ఈ కేసులో మరో కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి.
కాంతి , బాలాజీ మొదట్లో బాగానే ఉండేవారు. బాలాజీ మద్యానికి అలవాటు పడి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అతడు తన తీరు మార్చుకోవాలని అనేక సందర్భాలలో బంధువులు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరికి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచాడు. దీంతో కాంతి మనసు విరిగి బావకు దగ్గర అయింది. ఈ విషయం తెలిసిన బాలాజీ ఆమెను మరింత వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక.. బావతో కలిసి ప్రణాళిక రూపొందించింది. గడ్డి మందు కలిపి అంతం చేసింది. కానీ కాంతి బాలాజీ విషయంలో ఇంతటి దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదని” చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
ప్రియుళ్లతో కలిసి భార్యలు భర్తలను అంతం చేసిన ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మూడు చోటుచేసుకున్నాయి.. గద్వాల జిల్లాలో ఇటీవల ఒక సంఘటన జరగగా.. అది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దాన్ని మర్చిపోకముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య భర్తను కిరాయి వ్యక్తులతో కారుతో గుద్దించి అంతం చేసింది. ఇప్పుడు బాలాజీ రూపంలో మరో దారుణం జరిగింది. బావతో కలిసి బాలాజీని అతని భార్య కాంతి అంతం చేసింది.. గడ్డి మందు కలిపి కూల్ డ్రింక్ అందించింది. అతడు లిక్కర్ లో కలుపుకుని దానిని తాగాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది.