Homeక్రైమ్‌Tejeshwar Case: ఏడుపు కోసం గ్లిజరిన్..బెడ్ రూమ్ లో స్పై కెమెరా... తేజేశ్వర్ కేసులో విస్తు...

Tejeshwar Case: ఏడుపు కోసం గ్లిజరిన్..బెడ్ రూమ్ లో స్పై కెమెరా… తేజేశ్వర్ కేసులో విస్తు గొలిపే వాస్తవాలు..

Tejeshwar Case: సినిమాలు పనికిరావు. వెబ్ సిరీస్ లు ఏమాత్రం లెక్కలోకి రావు. చివరికి నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీలు కూడా సరిపోవు. అలా జరిగింది మరి ఈ హత్య కథా చిత్రం. ఆమె ఇంతకుముందే రకరకాల సంబంధాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి బ్యాంక్ మేనేజర్ తో సరస సల్లాపాలు కొనసాగిస్తోంది. ఆ బ్యాంకు మేనేజర్ మహా రసికుడు. అంతకుముందే ఆ యువతీ తల్లితో వ్యవహారం మొదలుపెట్టాడు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ఇటుతల్లిని.. అటు ఆమె బిడ్డను ఏకకాలంలో ఆ బ్యాంకు మేనేజర్ సుఖ పెడుతున్నాడు.. ఇటువంటి పరిణామం మిగతా వారికి ఇబ్బంది ఏమో గాని.. వారికి మాత్రం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఎంతకాలం ఈ డ్యూయల్ బతుకు అని ఆ యువతి తల్లికి అనిపించింది. అంతే ఓ బకరాని చూసి పెళ్లి ఖాయం చేసింది. అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత.. బ్యాంకు మేనేజర్ ని మర్చిపోలేక.. భర్తనే చంపించేసింది ఆ ఇల్లాలు. ఇక ఈ కేసులో అనేక ట్విస్టులు.. మలుపులు చోటు చేసుకున్న తర్వాత భర్తను చంపించిన భార్యను.. ఆమె ప్రియుడైన బ్యాంకు మేనేజర్ ను.. ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇంతవరకు తేజేశ్వర్ ఘటనలో పై విషయాలు మాత్రమే అందరికీ తెలుసు.

Also Read: జిమ్ కు వెళ్లలేదు.. చాట్ జిపిటి తో 11 కిలోల బరువు తగ్గాడు.. ఎలాగంటే

తేజేశ్వర్ ఘటనలో పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో బుర్ర బద్దలైపోయి.. మైండ్ బ్లాంక్ అయిపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇవి విన్నాక పోలీసులకు కాలూ చేయీ కదలడం లేదు. ఒక రకంగా వారికే షాక్ కొట్టినంత పని అవుతోంది.. తేజేశ్వర్ ను అంతం చేసిన తర్వాత అతని భార్య ఐశ్వర్య ధైర్యంగా ఉంది. పైగా పోయడనుకొని సంబరాలు కూడా చేసుకుంది. అక్కడే తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కాకపోతే పెళ్లయి కొద్దిరోజులే అవుతున్నది కాబట్టి వారు ఆమె విషయంలో నోరు మెదపలేదు. చివరికి తేజేశ్వర్ మృతదేహం దొరికిన తర్వాత.. ఐశ్వర్య మహానటి లాగా నటించడం మొదలుపెట్టింది. ఏడుపు రాకపోయినప్పటికీ గ్లిజరిన్ పూసుకొని ఏడ్చినట్టు చేసింది. గ్లిజరిన్ బాటిల్ కూడా ఇంట్లోనే పెట్టడం విశేషం. ఐశ్వర్య ప్రియుడు, బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఏకంగా ఒక స్పై కెమెరాను ఆమె బెడ్ రూమ్లో ఏర్పాటు చేయడం విశేషం. ” ఏమే నువ్వు వాడితో ఉండకు. దూరంగా పడుకో. నువ్వు ఏం చేసేది నాకు కనిపిస్తూనే ఉంటుంది. నేను నిత్యం నిన్ను చూస్తూనే ఉంటాను. ఏమైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్తగా ఉండు అంటూ” ఐశ్వర్యను బ్యాంకు మేనేజర్ తిరుమలరావు నిత్యం హెచ్చరిస్తూనే ఉండేవాడు.

తేజశ్వర్ చనిపోయిన తర్వాత.. మరుసటి రోజు తిరుమల రావు మెసెంజర్ ద్వారా ఐశ్వర్య కు ఫోన్ చేసేవాడు. ఐశ్వర్య తేజేశ్వర్ ఇంట్లో ఉంది కాబట్టి.. అతడి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండడానికి లేడీ గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడినట్టు చేసేవాడు. లేడీ గొంతు వినిపించడంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనేవారు కాదు. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం ఒక రకంగా తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించినప్పటికీ.. ఆడ గొంతు కావడంతో ఏమీ అనలేకపోయేవారు. అయితే ఇప్పుడు పోలీసులు విచారణలో గ్లిజరిన్ వాడటం.. స్పై కెమెరా బిగించడం.. ఇంకా వాయిస్ మెసెంజర్ లో ఆడ గొంతుతో మాట్లాడటం.. వంటివి వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఈ కేసులో పోలీసులకు మరిన్ని బలమైన ఆధారాలు లభించినట్టు అయింది. కేసు తీవ్రమైనది కాబట్టి.. నిందితులకు కఠినమైన శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version