ఇటీవల పరువు హత్యకు గురైన హేమంత్ హత్య కేసులో రోజుకో కోణం వెలుగుచూస్తోంది. బిడ్డ కులాంతర వివాహం చేసుకున్నందుకు పరువు పోయిందనే ఉన్నాదపు ఆలోచనలతో అమ్మాయి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బిడ్డను పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భర్తలను లేకుండా చేశాడు. ఇప్పటివరకు 18 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు అవంతి ఆరోపిస్తోంది. అంతేకాదు.. సందీప్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ ఉందని అవంతి చెప్పింది. తమ కుమారుడిని హత్య చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హేమంత్ కుటుంబసభ్యులు కూడా సోమవారం సైబరాబాద్ పోలీసులను కలిసి కోరారు.
Also Read : కోర్టుల ద్వారా రక్షణ పొందినా.. కృష్ణమ్మ ఊరుకోదు చంద్రబాబూ?
హేమంత్ కేసులో ఇప్పటికే 18 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి ప్రమేయం ఉందని అవంతి చెబుతోంది. గతంలో బెదిరింపులకు దిగిన ఆడియో టేపులను పోలీసులకు ఇచ్చారు. హేమంత్‌ను దారుణంగా చంపిన ఏ ఒక్కరినీ వదలొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు వస్తున్న సందీప్, ఆశిష్ రెడ్డిలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
హేమంత్ తల్లి, అవంతి తల్లి అర్చన స్నేహితులని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అవంతి ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా హేమంత్ తల్లి బ్యూటీషియన్‌గా వెళ్లేదట. ఈ క్రమంలోనే అవంతి హేమంత్ తల్లికి దగ్గరయింది. ఆ తర్వాత ఆమె హేమంత్‌తో ప్రేమలో పడింది. పరువు పోయిందనే పగతో హేమంత్‌ను అవంతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
8 నెలల నుంచి పగతో రగిలిపోతున్న అవంతి కుటుంబం.. హేమంత్ లక్ష్యంగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో 18 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపారు. హేమంత్ కిడ్నాప్ అనంతరం కారులో వెళ్తున్న క్రమంలోనే దారుణంగా చెప్పులతో ముఖంపై దాడి చేశారు. తాళ్లతో చేతులూ, కాళ్లు కట్టేసి సంగారెడ్డి సమీపంలో ఓ వెంచర్‌లో మృతదేహాన్ని పడేశారు.
Also Read : అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్..?