https://oktelugu.com/

పూరికి మహేశ్‌ సర్ ప్రైజ్.. పూరి ఫెవరేట్‌ డైరెక్టరంట..

‘ఎవ్వడు కొడితే దిమ్మ దిరిగి.. మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే పండుగాడు..’ అంటూ పోకిరీ సినిమా తీసి మహేశ్‌లోని మాస్‌ కోణాన్ని వెలికితీశాడు మాస్‌ డైరెక్టర్‌‌ పూరి జగన్నాథ్‌. పోకిరీ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిందో.. మహేశ్‌ ఏ స్తాయిలో మాస్‌ ఇమేజీ తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. అందుకే.. తనకు ఇష్టమైన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్‌ కూడా ఒకరని చెబుతున్నాడు మహేశ్. Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 02:27 PM IST
    Follow us on

    ‘ఎవ్వడు కొడితే దిమ్మ దిరిగి.. మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే పండుగాడు..’ అంటూ పోకిరీ సినిమా తీసి మహేశ్‌లోని మాస్‌ కోణాన్ని వెలికితీశాడు మాస్‌ డైరెక్టర్‌‌ పూరి జగన్నాథ్‌. పోకిరీ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిందో.. మహేశ్‌ ఏ స్తాయిలో మాస్‌ ఇమేజీ తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. అందుకే.. తనకు ఇష్టమైన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్‌ కూడా ఒకరని చెబుతున్నాడు మహేశ్.

    Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా?

    నేడు పూరి 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెష్‌ చెబుతున్నారు. సూపర్‌‌ స్టార్ మహేశ్‌ బాబు కూడా కొద్దిసేపటి క్రితం ట్విట్వర్‌‌ వేదికగా స్పందించాడు. ‘నా ఫేవరేట్‌ డైరెక్టర్స్‌ల్లో ఒకరైన పూరి జగన్నాథ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీ భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

    దీంతో పూరి, మహేశ్‌ మధ్య ఉన్న మనస్పర్థల పుకార్లకు ఈ ట్వీట్‌ చెక్‌ పెట్టినట్లైంది. గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ని మహేశ్‌తో మూవీ గురించి అడిగితే కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ‘నేను సక్సెస్‌లో లేకపోతే మహేశ్‌ పట్టించుకోడు’ అని మాట్లాడారు. ఈ కామెంట్స్‌ మహేశ్‌తోపాటు ఆయన ఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.

    కానీ.. మహేశ్‌ ఫ్యాన్స్‌ మాత్రం పూరితో మరో మూవీ చేయాలని కోరుకుంటున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. పోకిరి ఇండస్ట్రీ హిట్‌ రాగా.. బిజినెస్‌మెన్‌ సూపర్‌‌ హిట్‌ కొట్టింది. ఈ రెండు చిత్రాలలో మహేశ్‌ మేనరిజాన్ని పూరి కొత్తగా చూపారు. ప్రస్తుతం పూరి విజయ దేవరకొండతో ఓ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌ తెరకెక్కిస్తున్నారు. ఇక ముందైనా మహేశ్‌తో సినిమా ప్లాన్‌ చేస్తాడో లేదో చూడాలి.

    Also Read : ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు !