ఆ నీళ్లతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చా..?

డయాబెటిస్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడి ఉంటారు. డయాబెటిస్ రావడం వల్ల మన శరీరం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణ చేయడానికి తగిన మోతాదులో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో డయాబెటిస్ తో బాధపడే వారికి వైద్యులు ఎన్నో సూచనలు ఇస్తున్నారు. ఆహార విషయంలో సరైన డైట్ ని ఫాలో అవుతూ,శరీరానికి తగిన వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు […]

Written By: Navya, Updated On : November 23, 2020 2:54 pm
Follow us on

డయాబెటిస్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడి ఉంటారు. డయాబెటిస్ రావడం వల్ల మన శరీరం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణ చేయడానికి తగిన మోతాదులో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో డయాబెటిస్ తో బాధపడే వారికి వైద్యులు ఎన్నో సూచనలు ఇస్తున్నారు. ఆహార విషయంలో సరైన డైట్ ని ఫాలో అవుతూ,శరీరానికి తగిన వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు ఈ డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా సాఫ్ట్ డ్రింక్స్, వంటివాటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం ఎంతో మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మెంతి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తాజా పరిశోధనల్లో నిపుణులు వెల్లడించారు….

మెంతులు చూడటానికి చిన్నవిగా బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ, వాటి రుచి మాత్రం కొద్దిగా చేదుగా ఉండటం వల్ల తినడానికి ఇష్టపడరు. కానీ ఈ మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో మెంతి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో రుజువైంది. డయాబెటిస్ తో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి చేసి షుగర్ గ్రహింపును తగ్గిస్తుంది.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను ఒక చిన్న గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ మెంతులను తీసేసి పరగడుపున ఆ నీటిని తాగటం వల్ల డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. మెంతులు కేవలం డయాబెటిస్ కి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచి, ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అలాగే దగ్గు జలుబు గొంతునొప్పి వంటి సమస్యలకు మెంతులు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.