Ramoji Rao : ఇటీవల ఈనాడు పత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దానికంటే ముందు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఈనాడు వ్యవస్థాపకులు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూయడంతో ఆ పత్రిక 50 సంవత్సరాల సంబరాన్ని చూడలేకపోయారు. అయినప్పటికీ రామోజీరావును తలుచుకుంటూ ఈనాడు యాజమాన్యం ఘనంగా 50 సంవత్సరాల వేడుకను నిర్వహించింది. భవిష్యత్తు కాలంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతామని ప్రస్తుత ఈనాడు ఎండీ కిరణ్ ప్రతీన బూనారు. ఇన్నాళ్లు పాటించిన విలువలను కాపాడుకుంటామని చెప్పారు. తన తండ్రి రామోజీరావు పాదుకొల్పిన ఈనాడును మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఈనాడు సంస్థను మరింతగా విస్తరిస్తామని వ్యాఖ్యానించారు. అయితే ఈనాడు ప్రస్తుత ఎండీ కిరణ్ కుమార్ చెప్పినట్టుగా రామోజీరావు ఆ స్థాయిలో గొప్పవాడు కాదా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మరి కొంతమంది వల్లె వేస్తున్నట్టుగా రామోజీరావు పాత్రికేయంలో విలువలను కాపాడలేదా? ఆయన కూడా ఒకప్పుడు వసూళ్లకు పాల్పడ్డారా? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఓ వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశారా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు పాత్రికేయుడుగా పనిచేసిన ధారా గోపి..
ఇటీవల ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన ధారా గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు..”రామోజీరావు అప్పట్లో మంత్రుల నుంచి డబ్బులు తీసుకునేవారు. ఇదే విషయాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. దమ్మపేట ఈనాడు రిపోర్టర్ కు 500, ఈనాడు పత్రికకు నిర్వహించే రామోజీరావుకు ఐదు కోట్లు.. అంటూ తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారని” రవి బాంబు పేల్చారు.. అయితే ఈ వీడియోను వైసిపి అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్ లో తెగ సర్కులేట్ చేస్తున్నారు. మార్గదర్శి మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో ఆ ప్రైవేట్ న్యూస్ ఛానల్ రామోజీరావు ను లక్ష్యంగా చేసుకొని ఈ చర్చా వేదిక నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు కథనాలను ప్రసారం చేసింది. పలు కథనాలను ప్రచురించింది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసిపి కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. ఇక అప్పటినుంచి రామోజీరావు, ఈనాడు గ్రూపు సంస్థలపై ఆ న్యూస్ ఛానల్ కక్ష కట్టినట్టు తెలుస్తోంది. అందువల్లే ఇలాంటి చర్చా వేదికలు నిర్వహిస్తుందని టిడిపి అనుకూల నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నెటిజన్లను తీవ్రంగా విమర్శిస్తున్నారు. 11 సీట్లకే పరిమితమైనప్పటికీ బుద్ధి రాకపోతే ఎలా అంటూ.. మందలిస్తున్నారు.
అయితే ఈ వీడియో చూసిన కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాత్రం.. రామోజీరావు అలా చేసి ఉండడని వ్యాఖ్యానిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేసిన ధారా గోపి గొప్ప జర్నలిస్ట్ అయితే.. అతడిని విధుల నుంచి ఎందుకు తొలగిస్తారని పేర్కొంటున్నారు. కావాలని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.