https://oktelugu.com/

Prabhas : బిగ్ బ్రేకింగ్ : ఒకే రోజు రెండు ప్రభాస్ సినిమాలు..చరిత్రలో తొలిసారి..ఫ్యాన్స్ కి పండగే!

ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారట. ఒక ప్రొడక్షన్ హౌస్ ఒకేసారి రెండు సినిమాలు రీ రిలీజ్ చెయ్యడం ఈ ట్రెండ్ లో ఇదే మొదటిసారి. మరి ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ అభిమానులు ఎలాంటి రికార్డ్స్ పెడుతారో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : August 21, 2024 / 09:14 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ఎంత మంచి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘సలార్’ హిట్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ మేనియా నుండి అభిమానులు పూర్తిగా బయటకి రాకముందే ‘కల్కి’ చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తే మరో రెండు దశాబ్దాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలుతాడు అనే విధంగా ఉన్నాయి. ప్రభాస్ కి అన్నీ రికార్డ్స్ ఉన్నాయి కానీ, రీ రిలీజ్ రికార్డ్స్ మాత్రం లేవు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆ హీరోల పాత వింటేజ్ సూపర్ హిట్ సినిమాలను హై క్వాలిటీ కి మార్చి, మంచి క్వాలిటీ ఉన్న థియేటర్స్ లో విడుదల చేస్తుంటారు. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కింగ్స్ గా నిలిచారు. రీ రిలీజ్ రికార్డ్స్ కేవలం ఈ ఇద్దరి హీరోల సినిమాల మధ్యనే ఉన్నాయి. ఈ ట్రెండ్ లో ప్రభాస్ బాగా వెనకబడి ఉన్నాడు. అయితే ఈసారి ఆయన అభిమానులు ఈ ట్రెండ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్టోబర్ 23 వ తారీఖున ఆయన పుట్టినరోజు వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో జరపాలని కంకణం కట్టుకున్నారు.

    ఊర మాస్ ఇమేజి ఉన్న ప్రభాస్ ని యూత్ ఆడియన్స్ కి దగ్గరగా చేసిన చిత్రం డార్లింగ్. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా కేవలం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ప్రభాస్ అంటే అభిమానులు ఊర మాస్ యాక్షన్ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలను ఊహిస్తారు. అవి రెండు ఈ చిత్రం లో లేకపోవడం తో కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినప్పటికీ, పెద్ద వసూళ్లను చూడలేకపోయింది. కానీ సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలంటే ప్రేక్షకులు చెవి కోసేసుకుంటారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రం తో ఆల్ టైం రికార్డు పెట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారు.

    అలాగే అదే 23 వ తారీఖున ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్’ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. నేటి తరం ప్రభాస్ అభిమానులు కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటారు. ఈ చిత్రం లో ప్రభాస్ లుక్స్ అద్భుతంగా ఉంటాయి. అప్పట్లో ఈ చిత్రం కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారట. ఒక ప్రొడక్షన్ హౌస్ ఒకేసారి రెండు సినిమాలు రీ రిలీజ్ చెయ్యడం ఈ ట్రెండ్ లో ఇదే మొదటిసారి. మరి ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ అభిమానులు ఎలాంటి రికార్డ్స్ పెడుతారో చూడాలి.