https://oktelugu.com/

Rana – Samantha : రానా – సమంత కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పేరు చెప్పగలరా? పాపులర్ సూపర్ హిట్ కి రీమేక్!

తమిళం లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నటిస్తున్న వెట్టియాన్ చిత్రంలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 21, 2024 / 09:42 PM IST

    Rana-Samantha combination

    Follow us on

    Rana – Samantha : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి రానా దగ్గుపాటి, సమంత కాంబినేషన్. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదని అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న సమయంలో రానా కూడా సమంత కి బంధువు అయ్యాడు. ఆ తర్వాత సమంత నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత కూడా వీళ్ళు స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ ఒక్క సినిమా కావాలని సోషల్ మీడియాలో అభిమానులు వీళ్ళిద్దరినీ ట్యాగ్ చేసిమరీ కోరుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది అనే విషయం పాపం ఇప్పటి వరకు అభిమానులకు కూడా తెలియదు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే 2014 వ సంవత్సరం లో మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘బెంగళూరు డేస్’ అనే చిత్రం సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాని 2016 వ సంవత్సరంలో తమిళం లో ఇదే పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రం లో ఆర్య, శ్రీ విద్య, రానా, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం లో కూడా మలయాళంలో లాగానే పెద్ద హిట్ అయ్యింది. తమిళ వెర్షన్ ని తెలుగు లోకి దబ్ చేసి థియేటర్స్ లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ , ఎందుకో చివరి నిమిషంలో ఆగిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. బహుశా ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా చూసి ఉండరు. మంచి ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం మనల్ని అలరించడంతో పాటు, మనం మన స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవచ్చు. థియేటర్స్ లో ఎలాగో సరైన సినిమాలు లేవు కాబట్టి, కాసేపు సరదాగా టైం పాస్ చెయ్యాలనుకునేవారికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది, మిస్ కాకుండా చూడండి. ఇకపోతే ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    దగ్గుపాటి రానా బాహుబలి సినిమా పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఆయనకీ తమిళం లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుతో ఆయనకి అక్కడ వరుసగా సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ బాహుబలి సీక్వెల్ కోసం వాటిని రిజెక్ట్ చేసాడు. ప్రస్తుతం ఆయన తమిళం లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నటిస్తున్న వెట్టియాన్ చిత్రంలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.