Dil Raju: సినిమా రంగానిది, రాజకీయాలది విడదీయరాని బంధమే. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటివారు ముఖ్యమంత్రులు అయ్యారు. అనేక మంది కేంద్ర మంత్రులుగా, రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేశారు. పనిచేస్తున్నారు. ఇలా సినీ గ్లామర్‌తో ఎంతో మంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక పార్టీలు కూడా ఇండస్త్రీ వారిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వానికి, తెలుగు ఇండస్ట్రీకి మధ్య కాస్త దూరం కనిపిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌తో ఇండస్త్రీ పెద్దలు మంచి ర్యాప్ మెయింటేన్ చేశారు. కానీ రేవంత్‌రెడ్డితో ఇంకా అలాంటి సఖ్యత రావడం లేదు. దీంతో ఓ దశలో సీఎం ఇండస్త్రీపై విమర్శలు చేశారు. టికెట్ చేట్లు పెంచుకోవడానికి అనుమతులు కోరుతున్న ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు.. ప్రజలకు ఉపయోగపడే పని చేయడం లేదని విమర్శించారు. దీంతో గ్యాప్ మరింత పెరిగింది. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇండస్త్రీకి దగ్గరయ్యేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిల్ రాజకు కీలక పదవి..
టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన దిల్ రాజుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌ఏసీ) చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సడెన్‌గా దిల్‌రాజుకు పదవి ఇవ్వడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌తోపాట సినిమా ఇండస్ట్రీలో చర్చ జరగుతోంది.
కలిసి వచ్చిన సమాజికవర్గం..
ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు. అయినా దిల్ రాజుకు పదవి ఇవ్వడానికి రెడ్డి సమాజానికవర్గం కలిసి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు దిల్ రాజు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి కీలక పదవికి దిల్ రాజును ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఇండస్ట్రీని దగ్గర చేయడానికి..
సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ పూడ్చాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీలో ప్రస్తుతం కీరోల్ పోషిస్తున్న దిల్ రాజుకు కీలక పదవి అప్పగించారని సమాచారం. ఆయన నేతృత్వంలో ప్రభుత్వానికి ఇండస్ట్రీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయనను కాదని దిల్ రాజుకు పదవి అప్పగించారని తెలుస్తోంది.
దిల్ రాజు నేపథ్యం ఇదీ..
ఇక దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాలో పంపిణీదారుగా కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నార. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు నిర్మాతగా పనిచేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ సినిమా గేంమ్ ఛేంజర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. హీరో వెంకటేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు తమ్ముడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This is the real story behind revanth reddys key role for dil raju
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com