CM Revanth Reddy: కేసీఆర్ ‘6’ పోయి.. రేవంత్ రెడ్డి ‘9’ వచ్చే..కాన్వాయ్‌ కార్ల నంబర్‌ ఏంటో తెలుసా?*

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తడానికి కారణాలను తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Written By: Raj Shekar, Updated On : December 10, 2023 12:22 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లకు అధికారులు నంబర్‌ కేటాయించారు. శనివారం మొదటిసారిగా ఆయన తన కాన్వాయ్‌లో శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. కానీ, తొలి రోజునే ఆయనకు ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సీఎం కాన్వాయ్‌కి 0009 నంంబర్‌ కేటాయించారు. రేవంత్‌రెడ్డి అదృష్ట సంఖ్య 9 దీంతో ఆయన తన కాన్వాయ్‌లో 9 నంబర్‌ ఉండేలా చూసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికలు కూడా నవంబర్‌ 3న షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహించింది. డిసెంబర్‌ 3న ఫలితాలు వచ్చాయి. మొత్తం 3+3+3=9 నంబర్‌ రావడంతో ఎన్నికల ముందే.. ఈసారి లక్కు మాదే అని రేవంత్‌ ప్రకటించారు. అన్నట్లుగానే విజయం వరించింది.

ముఖ్యమంత్రికీ తప్పని ట్రాఫిక్‌ కష్టాలు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తడానికి కారణాలను తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ కాన్వాయ్‌ నంబర్‌ 6666
ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్వాయ్‌ నంబర్‌ 09కే6666 వాడారు. కేసీఆర్‌ 6 నంబర్‌ను అదృష్టంగా భావిస్తారు. అందుకే ఆయన తన కాన్వాయ్‌తోపాటు, వ్యక్తిగత కార్లకు కూడా ఆరు వచ్చేలా నంబర్‌ ఎంచుకున్నారు. 6+6+6+6 = 24 అంటే.. 2+4=6 ఇలా ఏరకంగా చూసినా 6 వచ్చేలా కేసీఆర్‌ నంబర్‌ను ఎంపిక చేసుకున్నారు.