Revanth’s Strategy Of Checking BRS: సెంటిమెంట్‌తో బీఆర్ఎస్‌కు చెక్ పెడుతున్న రేవంత్ వ్యూహమిదీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రాజకీయాలు హాట్‌హాట్‌గానే నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పోషిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టిన అడ్డుపడుతోంది. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు కొత్తగా తీసుకొస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాంట్లోనూ తప్పులే వెతుకుతోంది.

Written By: Srinivas, Updated On : November 7, 2024 4:34 pm

Revanth-Reddy

Follow us on

Revanth’s Strategy Of Checking BRS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రాజకీయాలు హాట్‌హాట్‌గానే నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పోషిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టిన అడ్డుపడుతోంది. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు కొత్తగా తీసుకొస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాంట్లోనూ తప్పులే వెతుకుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావాలని ముందుకు సాగుతోంది. కానీ.. ప్రజలు సైతం బీఆర్ఎస్‌ను పెద్దగా నమ్మినట్లుగాను అయితే కనిపించట్లేదు. మరోవైపు.. బీఆర్ఎస్ ఆగడాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్లాన్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక మూసీ ప్రక్షాళన చేపట్టాలని భావించింది. అయితే.. ఈ ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నప్పటికీ అప్పుడు అనివార్య కారణాల వల్ల గత పాలకులు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక మూసీ మీద ప్రత్యేక దృష్టి సారించింది. అందులోభాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఇంకొందరు ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నారు. దాంతో వారు రోడ్డెక్కి ఆందోళనబాట పట్టారు. బీఆర్ఎస్ నేతలను సైతం కలిశారు. దీనిని అవకాశంగా తీసుకున్న గులాబీ నేతలు అప్పటి నుంచి మూసీ మీద నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. అందులోనూ.. ఆ పార్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలకు చెక్ పెట్టేందుకు రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నల్లగొండ సెంటిమెంటును పండించేందుకు సిద్ధమైంది. సెంటిమెంటుతోనే బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. మూసీని వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజలను వ్యతిరేకించినట్లేనని ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. అందులోభాగంగానే రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంట పాదయాత్ర చేయబోతున్నారు. ఆ పాదయాత్రలో భాగంగా నల్లగొండ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. మూసీ వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అదే క్రమంలో ఆయన బీఆర్ఎస్ వైఖరిని సైతం వారికి వివరించే ప్రయత్నం చేసేందుకు రెడీ అయ్యారు. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి నల్లగొండను ఎంచుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు.. రేవంత్ పాదయాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూసీ ప్రక్షాళలను అడ్డుకుంటే నల్లగొండ ప్రజలు ఊరుకోబోరని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ వస్తున్నది. నల్లగొండ ప్రజలను ఎందుకు హింసిస్తారని, మూసీ విషం నల్లగొండ ప్రజలకు ఎందుకు తాగిస్తున్నారని సెంటిమెంట్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కలిసే మురికి, డ్రైనేజీ అంతా నల్లగొండకే వస్తుండడతో.. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకే.. మూసీ ప్రక్షాళన చేయకుంటే మరింతగా నష్టపోయేది కూడా నల్లగొండ వాసులే. అయితే.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లుగా తెలుస్తోంది. అందుకే రూట్ చేంజ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగానే తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, మూసీ పేరిట జరిగే దోపిడీకి వ్యతిరేకం అని తన స్టాండ్‌ను మార్చుకుంది. అందుకే అడ్డుకుంటున్నామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ మరోవిధంగా కౌంటర్ ఇస్తోంది. అసలు ప్రాజెక్టు టెండర్లు కాకుండానే.. పనులు ప్రారంభం కాకుండానే దోపిడీ ఎక్కడి నుంచి మొదలైందని నిలదీస్తున్నారు. ఇరు పార్టీల మూసీ రాజకీయంతో ప్రజలు సైతం ఆలోచనలో పడ్డారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సెంటిమెంటుతోనే బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని చూస్తుండడం రేవంత్ తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు.