https://oktelugu.com/

Surya Kanguva Movie: సూర్య ‘కంగువ’ విడుదల ఆగిపోనుందా..? ప్రొమోషన్స్ విరమించుకున్న మూవీ టీం..అసలు ఏమైందంటే!

మూవీ టీం కూడా సూర్య తో కలిసి విస్తృతంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా టీం మొత్తం సినిమా విడుదల హడావడిలో ఉండగా ఇప్పుడు కొత్తగా లీగల్ సమస్యలు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే కంగువ చిత్రం నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వద్ద 99 కోట్ల రూపాయిలు అప్పు చేసాడట.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 04:53 PM IST

    Surya Kanguva Movie

    Follow us on

    Surya Kanguva Movie :సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సూర్య నుండి గత మూడేళ్ళ నుండి సినిమా విడుదల లేని సంగతి అందరికి తెలిసిందే. 2022 వ సంవత్సరంలో ఆయన హీరోగా నటించిన ‘ఈటీ’ అనే చిత్రం విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకొని డైరెక్టర్ శివతో కలిసి ‘కంగువ’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కానుంది. మూవీ టీం కూడా సూర్య తో కలిసి విస్తృతంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా టీం మొత్తం సినిమా విడుదల హడావడిలో ఉండగా ఇప్పుడు కొత్తగా లీగల్ సమస్యలు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే కంగువ చిత్రం నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వద్ద 99 కోట్ల రూపాయిలు అప్పు చేసాడట.

    ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయిలు చెల్లించిన నిర్మాత, ఇంకా 45 కోట్ల రూపాయిలు అప్పు ఉన్నాడట. తనకి చెల్లించాల్సిన అప్పు చెల్లించకుండా సినిమాని విడుదల చేస్తున్నారని, అప్పు పూర్తిగా చెల్లించకుండా సినిమాని విడుదల చేసేందుకు వీలు లేదని, రిలయన్స్ సంస్థ హై కోర్టు లో పిటీషన్ వేసింది. దీనికి నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా కోర్టుకి వివరణ ఇస్తూ నవంబర్ 7న అప్పు మొత్తం తీర్చేస్తానని చెప్పుకొచ్చాడట. కానీ ఆయన ఇంకా చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కోర్టుని మరింత సమయం కోరే అవకాశం ఉన్నందున, అసలు కంగువ 14న విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. సూర్య నుండి చాలా కాలం తర్వాత వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రానికి ఇంతలా కంగారు పడే పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ కేసు విషయం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

    మరోపక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు అవుతాడని టాక్ ఉంది. ఈ విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో సూర్య ప్రసంగం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ ఇప్పటి వరకు కనీసం లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఈ వసూళ్లను చూసి అభిమానులు భయపడుతున్నారు. సినిమాకి నిజంగా జనాల్లో క్రేజ్ ఉందా లేదా, ఎందుకు ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది మేకర్స్ కి అర్థం కావడం లేదు. ఇదే తరహాలో ఇండియాలో కూడా ఉంటుందా లేదా మెరుగ్గా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.