KCR
KCR: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్‌ను కుంగదీసింది. దీంతో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెల్లి.. కాలుజారిపడ్డారు. తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకుని మూడు నెలలు మంచానికే పరిమితమయ్యారు. కాస్త కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతున్న సమయంలో ఢిల్లీ కుంభకోణం కేసులో ఈడీ కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసింది. దీంతో ఆయన మరింత కుంగిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, నేతలు అధికార పార్టీలోకి క్యూ కట్టారు. ఈ పరిణామంతో బాధను దిగమించుకుని లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటి పార్టీని కాపాడుకోవాలనుకున్నారు. ఈమేరకు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. కానీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశమిగిల్చాయి. ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్‌ఎస్ గెలవలేదు. దీంతో కేసీఆర్ మరింత సైలెంట్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎల్పీ లీడర్ అయినా కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుమాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కూతరు జైల్లో ఉండడంతో జనంలోకి రావడానికి ఇబ్బంది పడ్డారు. కానీ, ఇప్పుడు కవిత బెయిల్‌పై విడుదల కావడంతో మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది ప్రశ్నగా మిగిలింది.
వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేసిన కవిత..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన దాదాపు ఐదున్నర నెలలు జైల్లో ఉన్న కవిత ఆగస్టు 27 బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడే శపథం చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ హెచ్చకికలు పరోక్షంగా బీజేకి చేసినవే అని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై కేసులు పడటం.. అరెస్టు చేయడం వెనుక కాంగ్రెస్ కు ఎలాంటి పాత్ర లేదు కాబట్టి.. అంతా బీజేపీనే చేస్తోందని.. గతంలో ఆరోపించారు. దీంతో ఈ సవాల్ బీజేపీకే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కానీ.. ఇతర బీఆర్‌ఎస్ పెద్దలు కానీ బీజేపీ పేరు మాత్రం పలకలేదు. కవిత చేసిన సవాల్ కూడా వివాదాస్పదమయింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీనే నిందిస్తోంది. కానీ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మాత్రం పెద్దగా బీజేపీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇప్పుడు జనంలోకి వచ్చే కేసీఆర్ బీజేపీని పల్లెతు మాట అనకుండా ప్రజల్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్లడం ఖాయం. కాంగ్రెస్ ఆరోపణలు నిజమనే భావన కలుగుతుంది. కాంగ్రెస్‌ను విమర్శించకుంటే.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు బెయిల్ కోసం కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు త్యాగం చేసింది నిజమే అన్న అభిప్రాయం కలుగుతుంది.
బీజేపీతోనే ఫైట్..
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూస్తే. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును మెల్లగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. తమ పార్టీ ఓట్లను బీఆర్‌ఎస్సే బీజేపీకి మళ్లించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదే నిజమైనా.. బీఆర్‌ఎస్‌కు ముప్పే. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తనే.. తమ పార్టీ క్యాడర్ లో ఉన్న సందేహాలను పటా పంచలు చేసినట్లవుతుంది. గతంలో బీజేపీపై పలుమార్లు యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు అలాంటి యుద్ధం ప్రకటించాల్సి ఉంది. లేకపోతే ఇప్పటి వరకూ జరిగిన విలీనాలు, పొత్తుల అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. బీఆర్‌ఎస్ ప్లేస్ ను క్రమంగా బీజేపీ ఆక్రమించుకుంటుంది. కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తే.. అది బీజేపీకి మరింత ప్లస్ అవుతుంది. రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ మరి ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తారో చూడాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr wants to do active politics again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com