https://oktelugu.com/

Viral Video : నువ్వు వైట్ డ్రెస్ లో బాగుంటావు..నీకు లవర్ ఉన్నాడా? నువ్వు హర్ట్ అయితే తట్టుకోలేను.. ఇవీ ఆ వైస్ ప్రిన్సిపల్ చెబుతున్న పాఠాలు.. వీడియో వైరల్..

అది ఒక కార్పొరేట్ కాలేజీ. హైదరాబాద్ నగరంలోని మదినగూడ లో ఉంటుంది. అక్కడ సుమారు 2000 మంది వరకు విద్యార్థినులు చదువుతుంటారు. అక్కడ శివ అనే ఓ అధ్యాపకుడు ఉన్నారు. ఆయన వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. అయితే అతని వ్యవహార శైలి శృతిమించింది. విద్యార్థినులకు పాఠాలు చెప్పాల్సింది పోయి.. తనలో ఉన్న వికృత బుద్ధిని ప్రదర్శించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 05:40 PM IST

    Private College Vice Principal

    Follow us on

    Viral Video :  శివ ఆ కాలేజీలో చాలా రోజుల నుంచి వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అయితే అక్కడ చదువుకునే విద్యార్థినుల్లో తన సోదరిని, తన పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి.. వక్రబుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టాడు.. “ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి అంటూ” తన నెంబర్ వాళ్లకు ఇచ్చాడు. తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి విద్యార్థినులు ఫోన్ చేయగా.. వారి నెంబర్లను సేవ్ చేసుకొని..స్నాప్ చాట్ లో వికృతమైన మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాడు. ” నువ్వు వైట్ డ్రెస్ లో ఉంటే బాగుంటావు. నీకు లవర్ ఉన్నాడా? నువ్వు హర్ట్ అయితే తట్టుకోలేను” అంటూ మెసేజ్ లు పెట్టడం ప్రారంభించాడు. దీంతో విద్యార్థినులు ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలకు తెలియజేశారు. దీంతో వారు మంగళవారం ఆ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు

    విద్యార్థినులు తమకు వైస్ ప్రిన్సిపాల్ స్నాప్ చాట్ లో పంపిన మేసేజ్ లను పోలీసులకు చూపించారు. “మమ్మల్ని చాలా రోజులుగా వైస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడు. మేము వేసుకున్న డ్రస్సులను రకరకాలుగా వర్ణిస్తున్నాడు. అందమైన అమ్మాయిలకు పదేపదే మెసేజ్ లు పంపి ఇబ్బంది పెడుతున్నాడు. అది సరికాదని మేము చెప్పినప్పటికీ అతడు వినిపించుకోవడం లేదు. కళాశాల యాజమాన్యానికి చెబితే పట్టించుకోలేదు. అందువల్లే మేము విద్యార్థి సంఘాల నాయకులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు పూర్తి ఆధారాలను మీ ముందు ఉంచుతున్నాం. మాకు అక్కడ భద్రత లేదు. అతడిని విధుల నుంచి తొలగించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. మా అమ్మానాన్నలు అప్పు సప్పులు చేసి ఇక్కడ చదివిస్తున్నారు. ఇక్కడ పాఠాలకు బదులుగా ఆ వైస్ ప్రిన్సిపల్ అలా వ్యవహరిస్తున్నాడు. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించాలి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అతని వేధింపుల నుంచి మాకు రక్షణ కల్పించాలని” విద్యార్థినులు కోరారు. ఆ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో అక్కడ కలకలం నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు కళాశాల యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. కాగా, ఆ వైస్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థి సంఘాల ఆందోళనతో ఆ కళాశాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.