https://oktelugu.com/

Brain Rot Oxford: స్మార్ట్ వ్యసనం”.. ఏకంగా ఆక్స్ ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది.. ఇంతకీ ఆ పదం ఏంటంటే?

ఉదయం చెప్పే గుడ్ మార్నింగ్ నుంచి.. రాత్రి పడుకునే ముందు చెప్పే గుడ్ నైట్ వరకు.. స్నేహితుడితో మాట్లాడే మాటలు నుంచి.. స్విగ్గిలో చేసే ఫుడ్ డెలివరీ వరకు.. ఫేస్ బుక్ లో పెట్టె పోస్ట్ నుంచి.. బ్యాంక్ ఖాతా కు నగదు బదిలీ వరకు.. ఇలా ప్రతి ఒక్కటి స్మార్ట్ ఫోన్ ద్వారానే. అందుకే స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుంటే క్షణం కూడా గడవకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 05:37 PM IST

    Brain Rot Oxford

    Follow us on

    Brain Rot Oxford: స్మార్ట్ ఫోన్ ద్వారా సర్వం జరుగుతుండడంతో ఇది ఒక వ్యసనంగా మారింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే సాహవాసం సాగుతోంది. వీళ్ళు వాళ్లు అని తేడా లేకుండా అందరూ ఫోన్ కు బానిసలైపోయారు.. సోషల్ మీడియా ను విపరీతంగా వాడుతుండడంతో అందరూ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, యూట్యూబ్.. ఇలా అన్నింటిని చూసేస్తూ.. గంటలు గంటలు గడుపుతున్నారు. ఇలా గడపడం ఒక వ్యసనం అని వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ వ్యసనం ఆరోగ్యానికి కీడు చేకూర్చుతుందని హెచ్చరిస్తున్నారు. నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, రక్తనాళాల వ్యవస్థను స్మార్ట్ వ్యసనం ప్రభావితం చేస్తుందని వివరిస్తున్నారు..”అదేపనిగా ఫోన్ చూడకూడదు. ఎక్కువ బ్రైట్ నెస్ తో చూస్తే అది కళ్లపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు చూపు కూడా మందగించడానికి కారణం అవుతుంది. అలాంటప్పుడు ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలని” వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    ఆక్స్ ఫర్డ్ ఏకంగా పదాన్ని సృష్టించింది..

    స్మార్ట్ వ్యసనాన్ని ఆక్స్ ఫర్డ్ ప్రత్యేకంగా గుర్తించింది.. అయితే దీనికి ఏకంగా ఒక పదాన్ని రూపొందించింది. స్మార్ట్ వ్యసనాన్ని ఉద్దేశిస్తూ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ఇయర్ గా ప్రకటించింది. మానసిక స్థితిని క్షీణించడాన్ని బ్రెయిన్ రాట్ అంటారు. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆక్స్ ఫర్డ్ దీనిని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది..”రోజురోజుకు సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. చాలామంది అదే పనిగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. గంటల గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు. దీనివల్ల వారిలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. అవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. అందువల్లే స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ ను ఉపయోగ ఉన్నంతవరకే వాడాలి. లేకపోతే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్మార్ట్ వ్యసనాన్ని ఉద్దేశించి బ్రెయిన్ రాట్ అనే పదాన్ని విశేషంగా ఉపయోగిస్తున్నారు. అందువల్లే దీనిని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించామని” ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వెల్లడించింది.

    ఇప్పుడే కాదు..

    వర్డ్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించడం ఆక్స్ ఫర్డ్ కు ఇదే తొలిసారి కాదు. ప్రతి ఏడాది ఆక్స్ ఫర్డ్ ఈ విధానాన్ని అనుసరిస్తుంది. వినూత్న పదాలను వెలుగులోకి తెచ్చి.. వాటికి అర్థాలను వివరిస్తుంది. భాషా వ్యాప్తికి.. సామాజిక విస్తృతికి దోహదం చేసే ప్రక్రియలో భాగంగా తాము కొత్త కొత్త పదాలను కనిపెడుతున్నామని ఆక్స్ ఫర్డ్ వర్డ్ ప్రెస్ చెబుతోంది.