https://oktelugu.com/

Traffic ACP Who Was Caught Drunk: తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఈ ఏసీపీ మరిచినట్లు ఉన్నాడు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్న చిన్నపాటి సూత్రాన్ని విస్మరించి ఏకంగా పోలీసులపైనే చిందులేశాడు.

Written By: Srinivas, Updated On : November 14, 2024 3:15 pm
Traffic-Police

Traffic-Police

Follow us on

Traffic ACP Who Was Caught Drunk: చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఈ ఏసీపీ మరిచినట్లు ఉన్నాడు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్న చిన్నపాటి సూత్రాన్ని విస్మరించి ఏకంగా పోలీసులపైనే చిందులేశాడు. తప్ప తాగి కారు నడపడమే కాకుండా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో భాగంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే రెచ్చిపోయాడు. దీంతో పోలీసుపైనే పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. హంగామా సృష్టించినందుకు గాను హైదరాబాద్ పోలీసులు ఆ ఏసీపీపై కేసు నమోదు చేశారు.

సిద్దిపేట జిల్లా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సాదాసీదా దుస్తుల్లో మరో ముగ్గురితో కలిసి కారులో వెళ్తున్నాడు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వీరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద వీరిని ఆపారు. చెక్ పాయింట్ వద్దకు రాగానే.. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు. మిగితా వారిలో నుంచి మరో వ్యక్తి డ్రైవర్ సీట్లోకి వచ్చాడు. దీనిని ఓ మహిళా కానిస్టేబుల్ గమనించింది. ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించడానికి వాహనాన్ని ఆపారు. అయితే.. ఆ ఇద్దరు కూడా పోలీసులకు సహకరించేందుకు నిరాకరించారు. ట్రాఫిక్ పోలీసులతో ఏసీపీ జోక్యం చేసుకొని వాగ్వాదానికి దిగాడు. కారులో నుంచి దిగిన ఏసీపీ ఒక్కసారి పోలీసుల మీదకు రెచ్చిపోయాడు. తమ కారు వదిలేయాలని హెచ్చరించాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్టు లేకుండా వెళ్లేందుకు అనుమతించాలని పట్టుబడ్డాడు. కారు నడిపిన వ్యక్తిని వదిలేయాలని బిగ్గరగా కేకలు వేశాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షకు డ్రైవర్ మొండికేశాడు. బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకునేందుకు డ్రైవర్ మొండికేశాడు. ఏసీపీ కూడా ఊదొద్దని అడ్డుపడ్డాడు. అక్కడ తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను ఏసీపీ సుమాన్ తోసేశాడు.

అంతేకాదు.. కారు బానెట్‌పై కొడుతూ హల్‌చల్ చేశాడు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. దాంతో ట్రాఫిక్ పోలీసులు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా.. మద్యం తాగినట్లుగా వెల్లడైంది. మోతాదుకు మించి మరో 39 పాయింట్లు అదనంగా నమోదు అయింది. డ్రైవింగ్ చేసింది జైపాల్ రెడ్డి అని, అతను అల్వాల్‌కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డితోపాటు ఎం.శ్రీనివాస్, జి.వెంకటరావులపై ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్సై జి.కాంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసినట్లు మధురానగర్ పోలీసులు వెల్లడించారు. వాహనం చెక్ పాయింట్ వద్దకు రాగానే కారు డ్రైవర్ వెనుక సీట్లోకి వెళ్లడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ ఈ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో రికార్డు చేసింది. ఏసీపీతోపాటు మరో ముగ్గురిపై సెక్షన్‌ 132 (పబ్లిక్‌ సర్వెంట్‌పై దాడి చేయడం లేదా క్రిమినల్‌ బలగాలను ప్రయోగించడం), 238 (ఉద్దేశపూర్వకంగా దాచడం లేదా సాక్ష్యాలను నాశనం చేయడం)తోపాటు 221 (పబ్లిక్ సర్వెంట్‌ను వారి విధుల నిర్వహణలో అడ్డుకోవడం) r/w 3(5) BNS, సెక్షన్లు 185తో పాటు డ్రగ్స్ లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, 188, 205 మోటారు వాహనాల చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు.