https://oktelugu.com/

Chanakya Neethi: చాణక్య నీతి ఈ 5 విషయాల్లో సిగ్గు లేకుండా ఉండాలి.. లేకుంటే తీవ్ర నష్టం..

ప్రపంచంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొందరు మంచిగా ప్రవర్తించచ్చు.. మరికొందరు చెడు స్వభావాలను కలిగి ఉండొచ్చు.. అయితే చాలా మందితో సంబంధాలు కలిగి ఉండేవారు వారు ఎలా ఉన్నా వారితో ప్రయాణం చేయాల్సి వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 14, 2024 3:26 pm
    chanakya-niti

    chanakya-niti

    Follow us on

    Chanakya Neethi: ప్రపంచంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొందరు మంచిగా ప్రవర్తించచ్చు.. మరికొందరు చెడు స్వభావాలను కలిగి ఉండొచ్చు.. అయితే చాలా మందితో సంబంధాలు కలిగి ఉండేవారు వారు ఎలా ఉన్నా వారితో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎదుటి వారి వ్యక్తిత్వానితో సంబంధం లేకుండా వారితో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సిగ్గుపడుతూ మోహమాటానికి వెళ్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ విషయాల్లో మాత్రం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చాణక్య నీతి చెబుతోంది. ఇంతకీ ఏ విషయంలో సిగ్గును పక్కనబెట్టాలో తెలుసా?

    అప్పు ఇచ్చినప్పుడు:
    డబ్బు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. మరి కొందరి వద్ద తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకిరికి ఒకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో కొందరు దయా హృదయులు అవసరం అయినవరికి డబ్బును అప్పుగా ఇస్తుంటారు. అయితే తీసుకున్న కొంత మంది తిరిగి ఇవ్వడానికి వెనుకాడుతారు. అయితే వారి విషయంలో బిడియంగా ఉండే అ డబ్బులు రాకుండా ఉంటాయి. అందువల్ల ఏమాత్రం సిగ్గుపడకుండా అప్పును తిరిగి ఇవ్వాలని అడగాలి.

    తెలివిని పెంచుకునేందుకు:
    కొన్ని విషయాలను తెలుసుకోవాలని ఉత్సాహాం ఉంటుంది. కానీ ఒకరిని అడగాలంటే చాలా మంది ఆలోచిస్తారు. కానీ జ్ఞానాన్ని పొందాలనుకునేవారు గురువు లేదా మేధావులను పదే పదే అడిగి తెలుసుకోవాలి. ఈ విషయంలో మోహమాటానికి పోతే చాలా విషయాలు తెలియకుండా పోతాయి. దీంతో జీవితం ముందుకు సాగడానికి కష్టమవుతుంది. జీవితం సాఫీగా సాగాలంటే జ్ఞానం కచ్చితంగా ఉండాలి. అందువల్ల ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ఉండాలి.

    ఆహారం విషయంలో..:
    ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం విషయంలో ఏమాత్రం సిగ్గు పడకుండా ఉండాలి. కొందరు కొన్ని ప్రత్యేక కార్యక్రామాల్లో ఆహారం తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాల పాలవుతారు. దీంతో దీర్ఘ కాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉండాలి.

    అభిప్రాయాలను చెప్పే విషయంలో:
    చాలా మంది ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పది మందిలోకి వెళ్లిన తరువాత ఒక్క మాట కూడా మాట్లడలేదు. అంతేకాకుండా ఏదైనా విషయంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ఆలోచిస్తే తీవ్రంగా నష్టపోతారు. తమకున్న అభిప్రాయం తప్పయినా.. ఒప్పయినా బయటకు చెప్పేయాలి. లేకుండా ఆ తరువాత తీవ్రంగా మదనపడుతూ ఉంటారు.

    సూటిగా సమాధానం చెప్పేటప్పుడు:
    కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా విషయం అడిగినప్పుడు సమాధానం చెప్పరు. పదిమందిలో సిగ్గు పడుతూ ఉంటారు. కానీ ముఖ్యమైన వారితో సమాధానం చెప్పలేకపోతే ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం చేసేవారు అయితే కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతే తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల పై విషయాల్లో ఏమాత్రం సిగ్గుపడకుండా ఉండాలి. అప్పుడే జీవితం సక్రమంగా సాగుతుంది.