https://oktelugu.com/

Sri Reddy: సారీ జగనన్న.. ఏం చేయకు లోకేష్ అన్న.. శ్రీరెడ్డి లేఖల రచ్చ

గత ఐదేళ్లుగా వైసీపీకి మద్దతుగా నిలిచారు శ్రీరెడ్డి. టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె వాడిన భాష, వికృత చేష్టలు వైసీపీకి డామేజ్ చేశాయి. కూటమి అధినేతలు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు తాను చేసింది తప్పేనని శ్రీరెడ్డి స్వయంగా ఒప్పుకోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2024 / 03:12 PM IST

    Sri Reddy

    Follow us on

    Sri Reddy: వైసిపి హయాంలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. విపక్ష కూటమి నేతలపై అప్పట్లో వీడియోలతో చెలరేగిపోయేవారు ఆమె. కానీ ఇప్పుడు ఆమెకు చుక్కలు కనిపిస్తున్నాయి. కూటమి సర్కార్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వరుసగా అరెస్టు చేస్తున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదనే ప్రచారం ప్రారంభం అయింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు చోట్ల ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. ఆమె కోసం పోలీస్ బలగాలు గాలిస్తున్నాయని ప్రచారం నేపథ్యంలో శ్రీ రెడ్డి స్పందించారు. వైసిపి అధినేత జగన్ తో పాటు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా రెండు లేఖలు రాశారు.జగనన్న, భారతమ్మకు నమస్కారాలు అంటూ లేఖను ప్రారంభించారు శ్రీ రెడ్డి. ఈ జన్మకు మీ ఇద్దరినీ టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా అని తెలిపారు. ఓ ఫోటో కూడా తీసుకునే అదృష్టం కోల్పోయానని బాధపడ్డారు. తన పేరుతో వైసిపికి చెడ్డ పేరు తెచ్చానని.. తాను చేసిన పనికి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎంతోమంది దుమ్మెత్తి పోయడం తనను మానసికంగా కుంగదీస్తోందన్నారు. పార్టీని ప్రత్యర్థుల మాటల దాడి నుంచి కాపాడడానికి అనుకుంటూ ఎక్కువ డ్యామేజ్ చేశానని చెప్పుకొచ్చారు.

    * ఆ అనుబంధంతో
    గతంలో శ్రీ రెడ్డి సాక్షి మీడియాలో పనిచేసేవారు. సాక్షి ఛానల్ లో పనిచేసిన విషయాన్ని తాజాగా లేఖలో ప్రస్తావించారు శ్రీరెడ్డి. అప్పటినుంచి తనకు నీ మీద గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని జగన్ ను ఉద్దేశించి అన్నారు. వైసిపి ముందు నుంచి పడిన కష్టాలు చూసి ఉడత భక్తిగాజగనన్నకు సాయం చేద్దామనుకున్నట్లు తెలిపారు. వీర విధేయతతో ప్రత్యర్థులను టార్గెట్ చేసే క్రమంలో పార్టీని డ్యామేజ్ చేసినట్లు ఒప్పుకున్నారు శ్రీరెడ్డి. తాను చేసిన ప్రతి పని వల్ల మీరు ఎంత బాధ పడ్డారో తెలుసు అని.. తన పాపం మీకు అంటుకోవద్దని చెప్పుకొచ్చారు. కాబట్టి పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదని.. క్షమించాలని కోరారు.

    * పెద్ద మనసు చేయండి
    అటు తరువాత మంత్రి నారా లోకేష్ కు రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు శ్రీరెడ్డి. తాను పుట్టింది గోదావరి జిల్లాలోని.. కానీ పెరిగింది మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అన్నారు. 95% మీ వాళ్లే నా ఫ్రెండ్స్ అన్నారు. తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారని.. అమరావతికి రాజధాని రావడం వల్ల.. వాళ్ల సొంత ఇల్లు రేట్లు పెరిగాయని.. అందుకే వారంతా మీకు ఓటు వేశారని గుర్తు చేశారు. మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారు అంత మంచిగా ఉంటారని.. అందుకే తాను గత వీడియోలో తన కుటుంబ సభ్యులే నాతో మీకు సారీ చెప్పించారని చెప్పుకొచ్చారు. మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారని.. కానీ నాకు అంతస్థాయి లేక ఈ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు శ్రీరెడ్డి. గతంలో ప్రత్యర్థులను ఎంత దూషించానో తెలుసని.. అందుకే క్షమాపణలు చెప్పానని.. వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను అని.. తాను తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నానని.. ఈ లేఖ తాను తప్పించుకోవడానికి రాసింది కాదని.. తిరిగి వైసిపి వచ్చిన నా బుద్ధి వక్రమవుతుందని అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే ఏకకాలంలో శ్రీ రెడ్డి జగన్ తో పాటు లోకేష్ కు లేఖ రాయడం విశేషం.