Telangana: ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఇప్పటికీ మనసును కలిచి వేస్తుంది. అలాగే మరికొన్ని రోజుల కిందట ఓ కారులో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసిన సంఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఇలా అనేక సంఘటనలు వాహనాలలో జరుగుతుండడం అందరినీ భయపెడుతుంది. ఇవే కాకుండా కొన్ని వాహనాలు దొంగతనాలకు గురై ఇతర రాష్ట్రాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వాహనం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం చేస్తుంది. ఇది దేశంలోనే మొదటిసారి కావడం విశేషం. అంతేకాకుండా దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఒక వాహనం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఏం చేస్తారు?
Also Read: పోసాని అరెస్ట్.. రంగంలోకి జగన్.. ప్రచార అస్త్రంగా ఆ సామాజిక వర్గం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ప్రభుత్వ వాహనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలకు తప్పనిసరిగా లొకేషన్ ట్రేసింగ్ డివైస్(location tracing device…LTD) నీ అమర్చాలని నిర్ణయించింది. ఈ పేరులోనే తెలుస్తుంది ఈ డివైస్ ఏం పని చేస్తుందోనని.. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు అమర్చనున్నారు. ఈ డివైస్ తో ఒక వాహనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అలాగే ఆ వాహనంలో ఎలాంటి అక్రమాలు లేదా అనుకోని సంఘటనలు జరిగినా వెంటనే ట్రేస్ చేయడానికి వీలుంటుంది.
అయితే ఈ డివైస్ ను వాహనాలకు అమర్చడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అంతేకాకుండా ఈ డివైస్ ల కాంట్రాక్టు పై కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఇందులో నుంచి వాహనాలను ట్రేసింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి వాహనానికి ఈ ఎల్ టి డివైస్ ను అమర్చుకోవాలని ప్రభుత్వం తెల్పనుంది. ఒకవేళ ఈ డివైస్ ను అమర్చుకొని ఎడల వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి ఇది తప్పనిసరిగా అమర్చనున్నారు.
దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఇలాంటి డివైస్ను అమర్చలేదు. అయితే ఈ డివైస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాహనాలలో జరిగే సంఘటనల గురించి అందులోని వ్యక్తులు కొందరికి తెలియజేసిన ఆ వాహనం ట్రై చేయడానికి కష్టమవుతుంది. అయితే ఎల్ టి డి డివైస్ ను వాహనానికి అమరుస్తే అది ఎక్కడుందో వెంటనే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ఆపద సమయంలోనైనా ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
ప్రయాణికులు వెళ్లే వాహనాలలో మాత్రమే కాకుండా గూడ్స్ వాహనాల్లో కూడా దీనిని అమర్చనున్నారు. ఈ ఒక్క డివైస్ రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అనుమతి ఎప్పుడు వస్తుందోనని కొందరు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దీనిని అమర్చుకోవడం ద్వారా వాహనాలకు భద్రతా ఉంటుందని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే దీని కార్యకలాపాలు వేగంగా ఉంటాయని తెలుస్తోంది.
Also Read: నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఏపీ పోలీసులపై పోసాని భార్య సంచలన కామెంట్స్!