UP Budget 2025 : రెండు తెలుగు రాష్ట్రాలు రెవెన్యూలోటుతో సతమతమవుతున్నాయి. రాజధాని లేని ఆంధ్రా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విభజనతో నష్టపోయింది కాబట్టి రెవెన్యూ లోటుతో ఏపీ ఏర్పడింది. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు తెలంగాణ కూడా రెవెన్యూ లోటు రాష్ట్రంగా మిగిలిపోయింది.
ఒకనాటి బీమారు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రివర్స్ ట్రెండ్ లోకి వెళ్లింది. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చేసరికి రెవెన్యూ లోటుతో యూపీ సతమతమైంది. తాజాగా యూపీ బడ్జెట్ లో 80వేల కోట్ల రెవెన్యూను మిగులు బడ్జెట్ గా చూపించింది. యూపీ ప్రజల సొంత పన్నులే 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది రెండో అత్యధిక పన్నుల రాష్ట్రంగా ఉంది.
8.09 లక్షల కోట్ల బడ్జెట్ ను యూపీ ప్రవేశపెట్టడం సంచలనమైంది. ఏ రాష్ట్రం 6 లక్షల కోట్లకు మించి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మహారాష్ట్ర మాత్రమే యూపీకి సరితూగగలదు. మొత్తం యూపీ బడ్జెట్ లో 25 శాతం పెట్టుబడి వ్యయంగా ఉంది. క్యాపిటల్ అంచనానే 5.6 లక్షల కోట్లుగా ఉంది.
యూపీలో 80 వేల కోట్ల రెవిన్యూ మిగులుతో 8 లక్షల కోట్ల బడ్జెట్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
