Telangana Districts: తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. నోటిఫికేషన్‌ విడుదల.. రేపు అభ్యంతరాల స్వీకరణ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. కొన్ని జిల్లాలకు అక్కడి చారిత్రక నేపథ్యం ఆధారంగా పేర్లు పెట్టింది. సిరిసిల్లకు రాజన్న పేరు, భూపాలపల్లికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు, ఆసిఫాబాద్‌కు కుమురంభీం పేర్లు పెట్టారు.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 5:08 pm

Telangana Districts

Follow us on

Telangana Districts: తెలంగాణలో ములుగు జిల్లా పేరు మార్పు ప్రక్రియ మొదలైంది. ఈ జిల్లాకు గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా మంత్రి సీతక్క చొరవతో ములుగు కలెక్టర్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈమేరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణకు జిల్లా వ్యాప్తంగా బుధవారం గ్రామ సభలు నిర్వహిస్తారు.

అనేక వినతులు..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. కొన్ని జిల్లాలకు అక్కడి చారిత్రక నేపథ్యం ఆధారంగా పేర్లు పెట్టింది. సిరిసిల్లకు రాజన్న పేరు, భూపాలపల్లికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు, ఆసిఫాబాద్‌కు కుమురంభీం పేర్లు పెట్టారు. 9 మండలాలతో ఏర్పాటు చేసిన ములుగు జిల్లాకు కూడా గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలని అనేక వినతులు వచ్చాయి. అయినా నాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌ సర్కార్‌కు మళ్లీ వినతులు వెల్లువెత్తుతున్నాయి.

సీతక్క చొరవత..
జిల్లా మంత్రి సీతక్క చొరవతో జిల్లా పేరు మార్పునకు అడుగు పడింది. మంత్రి సూచనతో జిల్లా కలెక్టర్‌ దినకర్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3వ తేదీ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలలో తెలపాలని, సూచనలు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లి్లష్, తెలుగు మూడు భాషలలో వారి అభ్యంతరాలు తెలియజేయవచ్చని సూచించారు.

ప్రభుత్వం దృష్టికి గ్రామాల తీర్మానం..
బుధవారం గ్రామాల్లో చేసే తీర్మానాలను కలెక్టర్‌ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. తర్వాత ప్రభుత్వం గెజిట్‌లో ములుగుకు సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఆమోద ముద్ర లభిస్తుంది. గిరిజన దేవతలు సమ్మక్క సారక్క మేడారంలో కొలువుదీరిని జిల్లాకు ప్రత్యేతలు ఉన్నాయి. పర్యాటక కేంద్రా కూడా జిల్లా విరాజిల్లుతోంది. యూనేస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం ఈ జిల్లాలోనే ఉంది.