Mahesh Babu: ఘట్టమనేని కృష్ణ ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్ అయ్యారు. ఆయన వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు సైతం తండ్రి అడుగుజాడల్లో హీరోలు అయ్యారు. పెద్ద కుమారుడు అయిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించారు. అనంతరం 1987లో విడుదలైన సామ్రాట్ మూవీతో హీరోగా మారాడు. తండ్రి కృష్ణ, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న మహేష్ బాబుతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. రమేష్ బాబు హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆయన నిర్మాత అవతారం ఎత్తారు.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు చిత్రాలకు ఆయన సహ నిర్మాతగా, కొన్ని చిత్రాలకు ప్రజెంటర్ గా వ్యవహరించారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో రమేష్ బాబు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. 2022 జనవరిలో ఆరోగ్యం విషమించడంతో రమేష్ బాబు కన్నుమూశారు. రమేష్ బాబుకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు జయకృష్ణ.
ఈ జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం అందుతుంది. జయకృష్ణ ఒడ్డు పొడుగులో బాలీవుడ్ హీరోలా ఉంటాడు. కొన్ని కుటుంబ కార్యక్రమాల్లో జయకృష్ణ కనిపించాడు. విదేశాల్లో నటలో శిక్షణ తీసుకుంటున్న జయకృష్ణ త్వరలో ఇండియా వస్తాడట. ఆ వెంటనే హీరోగా లాంచ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కథ, దర్శకుడు ఫైనల్ కానున్నప్పటికీ జయకృష్ణ హీరోను హీరోగా లాంచ్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారట.
ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని జయకృష్ణ చిన్న తాతయ్య ఆదిశేషగిరిరావు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కాగా ఇది మహేష్ బాబుకు ఒకింత షాక్ అని చెప్పాలి. కృష్ణ వారసుడిగా గౌతమ్ కంటే ముందే అన్న కుమారుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే మహేష్ కుమారుడైన గౌతమ్ కి జయకృష్ణ నుండి ఎలాంటి పోటీ ఉండే అవకాశం లేదు. కృష్ణ ఫ్యాన్స్ మొదటి ప్రిఫరెన్స్ గౌతమ్ కే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిభ ఉన్నోళ్లే పరిశ్రమలో నిలబడతారు.