TG Tourism: తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే నల్లగొండ వరకు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. దట్టమైన అడవులు, కొండలు, కోనలు, నదులు, ఇతర దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఇవి అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. ఫలితంగా ప్రభుత్వం ఎంతో విలువైన ఆదాయాన్ని కోల్పోతుంది. పైగా ఈ ప్రాంతాలపై సరైన ప్రచారం లేక పెద్దగా ప్రజలు సందర్శించడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలంగాణ టూరిజం పాలసీకి ఓ దిశ దశ అంటూ లేకుండా పోతోంది. ఈ క్రమంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సమావేశమై.. పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలుపెడితే.. యాదగిరిగుట్ట వరకు ఒక సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సూచించారు.
ఎకో టూరిజం అభివృద్ధికి..
ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రాణానికి రూపొందిస్తోంది. సింగపూర్ తరహా లోనే ఎకో టూరిజం విధానాలను పరిశీలించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ” గోదావరి, కృష్ణ పుష్కరాలకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వచ్చేలాగా ఆకర్షించాలి. ఎకో టూరిజనికి అవసరమైన ప్రాంతాలను గుర్తించాలి. అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. హుస్సేన్ సాగర్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్కు ను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో జంగిల్ సఫారీ వంటి వాటిని అందుబాటులోకి తీసుకురావాలి. వీటిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అప్పుడు పర్యాటకంగా తెలంగాణ ప్రాంతానికి విశేషమైన ప్రాధాన్యం లభిస్తుంది.. అందువల్లే అధికారులు పర్యాటకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా సంకల్పంతో ముందుకు వెళ్లాలని” రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కనక పటిష్టమైన ప్రణాళికలు అమల్లోకి వస్తే.. కచ్చితంగా రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం వస్తుందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఉపాధి లభిస్తుంది
ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా తెలంగాణలో టూరిజం కనుక అభివృద్ధి చెందుతే స్థానికులకు విపరీతమైన ఉపాధి లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. పైగా టూరిజం అభివృద్ధి చెందడం వల్ల అనుబంధ శాఖలకు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం కూడా కాటేజీలు, ఇతర వసతి గృహాలు నిర్మించి.. అభివృద్ధి చేస్తే వాటిపై కూడా ఆదాయం లభిస్తుంది. మనదేశంలో కేరళ రాష్ట్రం, గోవా రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాయి. ఈ రెండు రాష్ట్రాలు విదేశీ పర్యటకులను ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. అక్కడ అవలంబిస్తున్న విధానాలను తెలంగాణలో కూడా అమలు చేస్తే కచ్చితంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.