Tirumala Lord: ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన హిందూ దేవుడు ఎవరు అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుంటారు. ఈ శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరు ఉన్న ఈ దేవుడికి నిత్య పూజలు, కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అలాగే కలియుగ దైవంగా పేర్కొంటూ ఈ స్వామి వారిని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. తిరుమలేషుడుగా.. వెంకటేశ్వర స్వామిగా.. శ్రీవారిగా.. బాలాజీగా గుర్తింపు పొందిన ఈ స్వామిని కోనేటి రాయుడు అని కూడా పిలుస్తారు. అసలు కోనేటి రాయుడు అని శ్రీవారిని పిలవడానికి కారణమేంటి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? చిత్తూరు జిల్లాలోని రెండవ తిరుమలగా పేరు ఉన్న మరో ఆలయం ఏంటి? ఆ వివరాలు కి వెళితే..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏడుకొండల పై తిరుమల శ్రీవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం స్ఫూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఆలయాలను ఏర్పాటు చేశారు. తిరుమలకు రాలేని భక్తులు అక్కడే స్వామి వారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అయితే చాలాచోట్ల ఏర్పాటయినా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కొన్ని మాత్రమే గుర్తింపు పొందాయి. వీటిలో చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి పురాతన కాలంలో చరిత్ర ఉంది. అంతేకాకుండా ఈ ఆలయాన్ని రెండవ తిరుమలగా పేర్కొంటున్నారు. అలా పేర్కొనడానికి ఓ కారణం ఉంది.
ప్రతి ఆలయంలో కోనేరు తప్పనిసరిగా ఉంటుంది. కానీ తిరుమల శ్రీవారిని మాత్రమే కోనేటి రాయుడు గా పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో కీలపట్ల అనే గ్రామ చివరన పురాతనమైన కోనేరు ఉన్నది. అరబ్బుల కాలంలో దండయాత్ర చేసిన సందర్భంలో స్వామివారికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయంలోని స్వామివారిని కాపాడుకునేందుకు విగ్రహాన్ని ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న కోనేరులో దాచిపెట్టారు. అయితే కొన్నాళ్ల తర్వాత బోయకొండ స్వామి అనే వ్యక్తికి శ్రీవారు కలలోకి వచ్చి తాను కోనేటిలో ఉన్నానని తీసుకెళ్లి ప్రతిష్టించాలని చెబుతాడు. దీంతో శ్రీవారిని గ్రామంలో ప్రతిష్టించారని పేర్కొంటారు.
అయితే ఇక్కడి కోనేరుకు అంతటి ప్రాధాన్యం ఏర్పడినందున స్వామివా రినీ కోనేటి రాయుడు అనిపిస్తారని చెప్పుకుంటారు. ఈ గ్రామంలో పురాతనమైన ప్రహరి, గోపురాలు, మండపాలను చూడొచ్చు. అలాగే తిరుమలలోని శ్రీవారికి చేసిన సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ గంగవరం మండలంలోని కీలపట్ల గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే తిరుమల శ్రీవారు ఎక్కడ వెలిసిన తిరుపతికి మాత్రం ఒక్కసారైనా రావాలని అనుకుంటారు. దీంతో ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. కొందరు ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుమల స్ఫూర్తిగా ఏర్పాటు చేసిన ఆలయాల్లో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.