HomeతెలంగాణHeat Waves: మండే అగ్నిగోళం: భరించలేని ఎండలు.. బయటకెళ్తే బతకలేరు

Heat Waves: మండే అగ్నిగోళం: భరించలేని ఎండలు.. బయటకెళ్తే బతకలేరు

Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. రోజు రోజుకూ వాతావరణం నిప్పుల కుంపటిలా మారుతోంది. వేడి, ఉక్కపోతతో ఇళ్లలో ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకు భానుడు ఠారెత్తిస్తుండడంగా, తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఒక్క తెలంగాణలోనే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు, వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు వాడగాలులు వీస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరుగుతాయని హెచ్చరించింది.

43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 2 నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవత, వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

కానరాని చలివేంద్రాలు..
ఇదిలా ఉండగా ఎండలోనే కూలీలు, ఉద్యోగులు పనులు నిర్వహిస్తున్నారు. రోజు వారీ కూలీలు వేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంకా ఇప్పటికీ చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అక్కడక్కడా ఏర్పాటు చేసినా అందులో నీళు‍్ల ఉండడం లేదు. వెంట తీసుకెళ్లిన నీళ్లు గంటలోపే అయిపోతున్నాయి. మరోవైపు నీటి కొరత, చేతిపంపులకు మరమ్మతులు చేయని కారణంగా ఆరు బయట తాగునీరు దొరకడం లేదు. దీంతో డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

ప్రచారానికి దూరంగా నేతలు..
మరోవైపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి పది రోజులైంది. అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అయినా నేతలు మాత్రం బయటకి రావడం లేదు. ఎండ వేడి కారణంగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కేవలం వాహనాలను పెట్టి వీధుల్లో తిప్పుతున్నారు. నాయకులు నేరుగా సభలు, సమావేశాలు నిర్వహించడంలేదు. ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేయడం లేదు. ఉష్ణోగ్రతలు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేనాటికి మరింత పెరుగుతాయని, అప్పుడు ప్రచారం ఇంకా కష్టమవుతుందని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఎండల కారణంగా శ్రేణులు కూడా ​‍పచారానికి వస్తారో రారో అని టెన్షన్‌ పడుతున్నారు. సభలు సక్సెస్‌ కాకపోతే తప్పుడు సంకేతాలు వెళాతయని భావిస్తున్నారు.

మూడు నెలలు ఎండలే..
ఇక దేశంలో ఈ ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఎండలు మండిపోతాయని, విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మూడు నెలలు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశముందని తెలిపింది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది.

జాగ్రత్తగా ఉండాలి..
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలర్జీ, చర్మ సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వస్తాయి. ఇవి దరి చేరకుండా ఉండేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

డీహైడ్రేషన్:
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టడంతో శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. నీరసం, కళ్లు తిరగడం, తల తిరగడం, చెమట ఎక్కువగా పట్టడం, నోరు ఎండిపోవడం, వాంతులు, విరేచనాలు వంటివి అవుతాయి. కాటన్ దుస్తులు ధరించాలి.

వడ దెబ్బ:
వేసవి కాలంలో ఎక్కువసేపు బయట ఉండడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. చర్మ క్యాన్సన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలో బయటకు రాకుండా ఉండాలి.. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. మధ్యాహ్నం బయటకు వెళితే గొడుగు, తాగునీరు తీసుకెళ్లాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, ఆందోళన, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తాపానికి విరుగుడు..
– వేసవి తాపానికి విరుగుడుగా ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని ఇంట్లో తేలిక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లం రసం పానీయం, దానిమ్మ, ద్రాక్ష రసాలు, జ్యూస్‌లు, ఐస్‌ క్రీములు వంటివి కూడా ఇళ్లలో తయారు చేసుకుని సేవించాలి.

– వేసవిలో దుస్తులు ధరించడం కూడా ప్రత్యేకంగా ఉండాలి. నూలు దుస్తులు వాడటం సరైంది. పిల్లలకైతే నూలు దుస్తులు వేయడం తప్పదు కాక తప్పదు. ముదురురంగు, మందపాటి వస్త్రాలు, దుస్తులు వాడొద్దు. పాలిస్టర్‌, సింథటిక్‌ అసలు వాడకూడదు. లేత రంగులవి, తెల్లని కాటన్‌ దుస్తులే వేసవికి సరిగ్గా సరిపోతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular