Telangana State Song: తెలంగాణ రాష్ట్ర గీతం రికార్డింగ్‌ పూర్తి.. ఆలపించిన యువ సింగర్స్‌!

తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్‌ యువ సింగర్స్‌ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ఎంఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు.

Written By: Raj Shekar, Updated On : June 1, 2024 3:18 pm

Telangana State Song

Follow us on

Telangana State Song: తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్‌ 2న దీనిని అధికారికంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఈ గీతం ఉర్రూతలూగించింది. జూన్‌ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. పూర్తి గీతం నిడివి పెద్దగా ఉండడంతో, ఆస్కార్‌ అవార్డు సంగీత దర్శకుడు ఎంఎం.కీరణవాణి, గీత రచయిత అందెశ్రీ కలిసి గీతాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆలపించేలా కుందించారు.

ఆలపించింది వీరే..
ఇక తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్‌ యువ సింగర్స్‌ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ఎంఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ పాట నిడివి 13.30 నిమిషాలు ఉండగా, దీనిని 2.30 నిమిషాలకు తగ్గించారు. ఈ రెండు పాటలను జూన్‌ 2ను ఆవిష్కరించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో 2.30 నిమిషాల నిడివి ఉన్న మూడు చరణాలు ఉన్న గీతం ఆలపిస్తారు.

సీఎంను కలిసిన కీరవాణి బృందం..
తెలంగాణ గీతం సిద్ధమైన నేపథ్యంలో కీరవాణి బృందం శనివారం(జూన్‌ 1న) సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. అందులో సింగర్స్‌ హారిక నారాయణ్, రేవంత్‌ ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్‌ హారిక ఇలా చెప్పుకొచ్చింది. ‘తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశమని తెలిపింది. ఈ గీతం రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం అని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో తనను భాగస్వామి చేసిన కీరవాణి, అందెశ్రీ గార్లకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి గారికి ధన్యవాదాలు అని పేర్కొంది.