https://oktelugu.com/

Shubman Gill Marriage: సచిన్ కూతురు సారా ఔట్.. రిద్దిమా ఇన్.. ఆమెతోనే శుభ్ మన్ గిల్ పెళ్లి

సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు తలవంచాల్సి వచ్చింది. సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ చేరాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 1, 2024 / 03:25 PM IST

    Shubman Gill Marriage

    Follow us on

    Shubman Gill Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరికీ పెళ్లి జరుగుతుందో.. ఎప్పుడు ఎవరికీ ముడి పడుతుందో ఎవరూ చెప్పలేరు. చివరికి పెళ్లి చేసుకునే వారు లేకపోయినా.. ప్రేమలో పడకపోయినా.. “ప్రేమ, పెళ్లి, కలిసే ఉంటున్నారు, పిల్లలు కూడా పుట్టేశారు” అని తీరుగా ప్రచారం జరుగుతుంది.. చివరికి అది “బురద చల్లుతాం, కడుక్కోవడం మీ ఖర్మ అన్నట్టుగా” ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు తలవంచాల్సి వచ్చింది. సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ చేరాడు.

    గిల్ కు సోషల్ మీడియాలో రకరకాల సంబంధాలు అంటగట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అతడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కర్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నాడని.. ఆమె కూడా అతడంటే పడి చస్తుందని.. అతడు ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్ కు హాజరవుతుందని.. అతడు మెరుగ్గా ఆడితే సచిన్ అభినందించేది అందుకేనని.. ఇలా రకరకాల ప్రచారాలకు సోషల్ మీడియా ఆజ్యం పోసింది. అయితే ఈ ప్రచారాలను అటు గిల్ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. ఇక సారా టెండూల్కర్ మీడియా ముందుకు రావడమే గగనం. అలాంటిది వీటి గురించి ఆమె ఏం చెబుతుంది..

    ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటయ్యా అంటే.. గిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట.. అతడు ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడట.. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ టీవీ నటి రిద్దిమా పండిట్. రిద్దిమా కు, గిల్ కు వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది.. అయినప్పటికీ వాటిని సోషల్ మీడియా పట్టించుకోవడం లేదు..గిల్, రిద్దిమా చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారని.. ఈ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారని విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులు రిద్దిమా కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. దీంతో ఆమె స్పందించక తప్పలేదు..ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను విడుదల చేసింది.

    ” నేను గిల్ ను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రసారమవుతున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి నేను సినిమా కెరియర్ పైనే దృష్టి పెట్టాను. నాకు పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదు. నా వివాహం గురించి చాలామంది మీడియా ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు. దీంతో నేను స్పందించక తప్పడం లేదు. ఇప్పుడు నాకు పెళ్లి ఏంటి? నేను చేసుకోవడమేంటి? ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఒకవేళ నా పెళ్లి కుదిరితే అందరికీ చెప్పి చేసుకుంటానని” రిద్దిమా క్లారిటీ ఇచ్చారు. కాగా, రిద్దిమా గిల్ కంటే పది సంవత్సరాలు వయసులో పెద్ద. ఇప్పటివరకు వీరిద్దరూ అటు ప్రొఫెషనల్ గా గాని, పర్సనల్ గా గాని కలిసిన సందర్భాలు లేవు..

    మరో వైపు గిల్ సారా తో ప్రేమలో ఉన్నాడని విపరీతమైన ప్రచారం నడుస్తోంది. గిల్ ఆడిన ప్రతి మ్యాచ్ కు సారా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలోనే రిద్దిమా సీన్ లోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆమె స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఇక ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రిద్దిమా హిందీ బిగ్ బాస్ షో లో ఆకట్టుకుంది. బహు హమారీ రజనీకాంత్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ద్వారానే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. “ఖత్రా ఖత్రా ఖత్రా” అనే రియాల్టీ షో లోనూ రిద్దిమా మెరిసింది.