కొత్త రేషన్ కార్డ్ కావాలా.. తెలంగాణలో ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కొన్ని పథకాలు పొందాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి అని తెలిసిందే. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొంతమంది రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలు రేషన్ కార్డ్ వల్ల పొందే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఆధార్ కార్డ్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కార్డ్ గా రేషన్ కార్డుకు గుర్తింపు ఉంది. రేషన్ కార్డ్ ఉంటే సబ్సిడీ ధరకే రేషన్ సరుకులను పొందవచ్చు. Also […]

Written By: Navya, Updated On : February 11, 2021 5:14 pm
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కొన్ని పథకాలు పొందాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి అని తెలిసిందే. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొంతమంది రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలు రేషన్ కార్డ్ వల్ల పొందే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఆధార్ కార్డ్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కార్డ్ గా రేషన్ కార్డుకు గుర్తింపు ఉంది. రేషన్ కార్డ్ ఉంటే సబ్సిడీ ధరకే రేషన్ సరుకులను పొందవచ్చు.

Also Read: శివుని ప్రసన్నం కొరకు మహిళ సజీవ సమాధి.. చివరకు..?

ఆరోగ్య శ్రీ స్కీమ్ తో ఇతర స్కీమ్ లకు అర్హత పొందాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే రేషన్ కార్డు లేని వాళ్లు కొత్త రేషన్ కార్డును తీసుకోవాలన్నా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లను యాడ్ చేయాలన్నా కొన్ని సింపుల్ స్టెప్స్ ను ఫాలో అయితే సులభంగా రేషన్ కార్డును పొందవచ్చు. రేషన్ కార్డులో వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డ్ ఉండగా ఆర్థిక స్థోమతను బట్టి వైట్ లేదా పింక్ రేషన్ కార్డును పొందవచ్చు.

Also Read: డిగ్రీ పాసైనవాళ్లకు శుభవార్త.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు..?

రేషన్ కార్డు కావాలంటే మొదట మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు తీసుకోవాలి. మీసేవా సర్వీస్ ఫార్మ్స్ ఆప్షన్ ద్వారా మీసేవా వెబ్ సైట్ నుంచి కూడా దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. tg.meeseva.gov.in/deptportal/meeseva-applications లింక్ ద్వారా కూడా దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫారంలో వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి.

మరిన్ని వార్తలు కోసం: జనరల్

రేషన్ కార్డ్ కావాలంటే ఒరిజినల్ రెసిడెన్షియల్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్‏పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మన దేశీయులై ఉండాలి. ఆ తరువాత సంతకం చేసి ఫీజు చేసి మీసేవలో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేస్తే అర్హులైన వారికి వారం రోజుల్లో రేషన్ కార్డు మంజూరవుతుంది.