https://oktelugu.com/

ఏపీ, తెలంగాణలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల సందడి నెలకొంది. చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే సారి ఎన్నికల నగారాను ఈసీ మోగించింది. ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుంది. ఇంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 14న […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 4:23 pm
    Follow us on

    ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల సందడి నెలకొంది. చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే సారి ఎన్నికల నగారాను ఈసీ మోగించింది. ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుంది. ఇంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

    ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి.

    ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26వరకు గడువు విధించారు.

    ఇక మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలు ప్రకటిస్తారు.

    తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ తోపాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్పార్టీ ఇప్పటికే నల్గొండ డివిజన్ కు రాములు నాయక్ ను, హైదరాబాద్ పరిధిలో చిన్నారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది.

    ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నల్గొండ డివిజన్ కు పల్లా రాజేశ్వరరెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్తిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ మాత్రం ఇంకా ఈ ప్రక్రియను మొదలు పెట్టలేదు.