https://oktelugu.com/

జమిలీకి కసరత్తు చేస్తున్న కేంద్రం..?

ఒకేదేశం.. ఒకే ఎన్నిక నినాదంతో జమిలీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు ఈ విషయమై సమీక్షించింది మోదీ సర్కారు. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఇందుకు అంతా సన్నద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లు అనిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించే […]

Written By: , Updated On : February 11, 2021 / 04:30 PM IST
Follow us on

Jamili Elections
ఒకేదేశం.. ఒకే ఎన్నిక నినాదంతో జమిలీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు ఈ విషయమై సమీక్షించింది మోదీ సర్కారు. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఇందుకు అంతా సన్నద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లు అనిపిస్తోంది.

జమిలీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయంలో స్పష్టమైన రోడ్డు మ్యాపు సిద్ధం చేయాలని న్యాయ కమీషన్ కు కేంద్రం సూచించింది. జమిలీ ఎన్నికలపై వచ్చిన ప్రతిపాదనలను ప్రస్తుతం లా కమిషన్ పరిశీలిస్తోంది. దే విషయం గురించి తాజాగా లా కమిషన్ కు రోడ్డు మ్యాపు తయారీ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

చాలా కాలంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై ప్రధాన మంత్రి మోదీ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పుడు అవకాశం దొరికినా.. జమిలీపై ప్రధాని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వన్ నేషన్.. వన్ రేషన్.. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానాలను అమలులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పద్ధతిని అమలు లోకి తీసుకురావాలని సీరియస్ గా ఆలోచిస్తుంది.. కేంద్ర సర్కారు.

మోదీ నిర్ణయం తీసుకున్న తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చేది లేదు. కాకపోతే.. ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభిప్రయాలే తేలాలి. ఇందులో కూడా కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని ఎవరూ అనుకోవడం లేదంట. కాకపోతే.. తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటారో.. చూడాలి ఇక…