Telangana Political News: రేణుకా చౌదరి.. తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు ఆమె మాట్లాడితే నిప్పు కణికలాగా ఉండేది. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె సోనియాగాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేది. రాహుల్ గాంధీ కూడా నమ్మదగిన అంతరంగికురాలుగా ఉండేది. ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా కూడా గెలిచింది. ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా ఆ జిల్లా రాజకీయాలను రేణుక చౌదరి శాసించారు కూడా. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె తన ప్రభను క్రమంగా కోల్పోయారు. ఇక ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆమె కంటూ అధిష్టానం కొన్ని నియంత్రణ రేఖలు గీయడంతో రేణుక పాత్ర నామమాత్రంగా మిగిలిపోయింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నప్పటికీ.. ఆమెలో ఒకప్పటి వాడి వేడి కనిపించడం లేదు.
Also Read: బీఆర్ఎస్ దెబ్బకు థంబ్ నెయిల్స్ మార్పించేసిన “మహా” వంశీ!
అమరావతి మహిళలపై ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్ పార్టీ అధినేతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా అవి రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత రేణుక చౌదరి అడపా దడపా ఇంటర్వ్యూలలో కనిపించడం మినహా రాజకీయంగా తన మార్క్ చూపించలేకపోతున్నారు. అయితే శుక్రవారం గాంధీభవన్ ఎదుట చోటు చేసుకున్న సంఘటన రేణుక చౌదరిని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిని చేశాయి. దీంతో వివిధ న్యూస్ ఛానల్స్ ఆమె కేంద్రంగా కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి.
Also Read: గాంధీభవన్ ముందే రేణుకాచౌదరి, ప్రేమ్ సాగర్ రావు రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో భేటీ ఏర్పాటు చేశారు. గాంధీభవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.. అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది నేతలను లోపలికి పోలీసులు పంపించలేదు. పోలీసులు పంపించని నాయకుల జాబితాలో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి కూడా ఉన్నారు. ఆమె ఎంత చెప్పినప్పటికీ కూడా పోలీసులు లోపలికి పంపించలేదు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ” నేను ఎవరో మీకు తెలియదా? నన్ను ఎందుకు లోపలికి పంపించడం లేదు? మేము ఒరిజినల్ కాంగ్రెస్.. బయటి నుంచి వచ్చిన వారు పార్టీని హైజాక్ చేశారు. నేను ఎవరికి చెప్పాలో వారికి చెబుతాను అంటూ” రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగానే ఇలాంటి వీడియోలను విపరీతంగా సర్క్యూరేట్ చేసి.. నెగిటివ్ ప్రచారం చేసే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా శుక్రవారం ఉదయం నుంచి అదే పని చేస్తోంది. ఆ కాడికి తాము అధికారంలో ఉన్నప్పుడు గొప్ప పనులు చేసినట్టు బిల్డప్ ఇస్తోంది. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిని ప్రగతి భవన్ నుంచి వెనక్కి పంపించిన చరిత్ర ఆ పార్టీది. గురువింద తన నలుపు ఎరుగనట్టు.. భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కొత్తగా నీతులు చెబుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందించినట్టు.. మిగతా వారితో పార్టీ అధ్యక్షుడు వేర్వేరుగా మాట్లాడతారని ఆ పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు.
ఎవ్వరికీ చెప్పాలో వాళ్లకే చెప్పుతా అంటున్న రేణుక చౌదరి :
గాంధీ భవన్ లోపలికి ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును అనుమతించని పోలీసులుగేటు దగ్గర పోలీసులతో ఎంపీ రేణుకా చౌదరి వాగ్వాదం
ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లం మమ్మల్నే లోపలికి పంపరా అంటూ పోలీసులపై ఫైర్ pic.twitter.com/ORam8Y5Dho
— Anitha Reddy (@Anithareddyatp) July 4, 2025