https://oktelugu.com/

Telangana Police: పోలీసుల భక్తిభావం.. యూనిఫాంలో అగ్ని గుండంలో నడక.. వీడియో వైరల్‌

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో చెరువుగట్టు జాతర ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు యూనిఫాం ధరించి అగ్నిగుండంలో నడవడం చర్చనీయాంశమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 23, 2024 / 12:59 PM IST

    Telangana Police

    Follow us on

    Telangana Police: తెలంగాణలో పండుగలు, జాతరలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. చిన్న పెద్ద, ధనిక పేద అనేతేడా లేకుండా అందరూ తమ సంప్రదాయం, ఆచారాల ప్రకారం పండుగలు జరుపుకుంటారు. దేవుళ్లతోపాటు ప్రకృతిని ఆరాధించే సంస్కృతి తెలంగాణలో ఉంది. జాతరలకు లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలి వచ్చారు. ములుగు ఎస్పీ షబరీశ్‌ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కుకు స్వాగతం పలికారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా మరో వీడియో కూడా నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఓ జాతరలో పోలీసులు యూనిఫాం ధరించి అగ్నిగుండంలో నడవడం ఈ వీడియోలో ఉంది. అయితే దీనిని కొందరు అభినందిస్తుండగా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు.

    తమకు సంబంధం లేదన్న పోలీస్‌ శాఖ..
    నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో చెరువుగట్టు జాతర ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు యూనిఫాం ధరించి అగ్నిగుండంలో నడవడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో పోలీస్‌ శాఖ స్పందించింది. దీనికి పోలీస్‌ శాఖకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అది వారి వ్యక్తిగత నమ్మకమని పేర్కొంది.

    శక్తివంతమైన శివాలయం..
    చెర్వుగట్టు ఆలయం హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లాయం చాలా శక్తివంతమైన శివాలయం. ప్రజలు ప్రతీనెల అమావాస్య రోజు కచ్చితంగా ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ఒకరోజు అక్కడే బస చేస్తారు. గుండంలో నడిస్తే వ్యాధులు మాయమవుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి కానివారికి పెళ్లి అవుతుందని విశ్వసిస్తారు. సంతానం లేనివారు నడిస్తే సంతానం కలుగుతుందని నమ్మిక. ఇక చెర్వుగట్టు ఆలయం దిగువన పార్వతమ్మ ఆలయం ఉంటుంది.

    ఆచారం..
    నల్లగొండ జిల్లా పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి జాతరలో భక్తులు అగ్నిగుండాలపై నడిచే ఆచారం అనాదిగా వస్తుంది. అయితే సాధారణ భక్తులతోపాటు పోలీసులు యూనిఫాంలో నిప్పులపై నడవడం ఆకట్టుకుంది. అయితే జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు మాత్రం ఇది మూఢనమ్మకమని, వాటిని నివారించాల్సిన పోలీసులు ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది పోలీసులను అభినందిస్తున్నారు. పోలీసులు కూడా సామాన్యులే కదా అని కామెంట్‌ చేస్తున్నారు.