https://oktelugu.com/

IPL 2024: సాగరనగరంలో రెండు ఐపిఎల్ మ్యాచ్ లు

నగర శివారులోని పోతినమల్లయ్యపాలెంలో ఈ స్టేడియం ఉంటుంది. జాతీయ రహదారి పక్కన ఉండే ఈ గ్రౌండ్ క్రికెట్ అభిమానుల మదిని దోచుకుంటుంది. నాలుగేళ్ల కిందట ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చింది.

Written By: , Updated On : February 23, 2024 / 01:02 PM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: విశాఖ నగరవాసులకు శుభవార్త. నగరంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ షెడ్యూల్లో విశాఖలోని ఏసిఏ-వీడిసిఎ స్టేడియం కు చోటు దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఇక్కడ స్టేడియం ఉన్నా అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించడం అంతంత మాత్రమే. చివరిసారిగా నాలుగేళ్ల కిందట ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. తాజా సీజన్లో రెండు మ్యాచ్లకు అవకాశం దక్కింది. దీంతో క్రీడాభిమానుల్లో సందడి నెలకొంది.

నగర శివారులోని పోతినమల్లయ్యపాలెంలో ఈ స్టేడియం ఉంటుంది. జాతీయ రహదారి పక్కన ఉండే ఈ గ్రౌండ్ క్రికెట్ అభిమానుల మదిని దోచుకుంటుంది. నాలుగేళ్ల కిందట ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చింది. 2012లో డెక్కన్ చార్టర్స్, 2015లో సన్రైజర్స్ హైదరాబాద్, 2016లో ముంబై ఇండియన్స్ జట్లు ఆడిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు వేదిక అయింది. 2019లో ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ మ్యాచులు లేకపోయినా.. కీలకమైన ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చింది.

తాజా ఐపిఎల్ షెడ్యూల్లో భాగంగా విశాఖలో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖలో జరిగే మ్యాచ్లకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ ల నుంచి క్రికెట్ అభిమానులు తరలివస్తుంటారు. ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లు జరిగిన టిక్కెట్లు హాట్ కేకుల అమ్ముడు అవుతాయి. ఈసారి కూడా సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు గిరాకీ ఖాయమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.