https://oktelugu.com/

Puri Jagannadh: ఆర్జీవీ నుంచి కథను లాక్కొని పూరి జగన్నాథ్ చేసిన సినిమా ఏంటో తెలుసా..?

హీరో అంటే ఒక ఆకతాయిగా తిరిగేవాడు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు, తనకి కోపం వస్తే కొట్టేవాడు, బాధ వస్తే ఏడ్చేవాడు. అనే విధంగా హీరో క్యారెక్టర్ ను సృష్టించి కూడా సినిమాలు తీయొచ్చు అని చూపించిన ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్.

Written By:
  • S Reddy
  • , Updated On : February 23, 2024 / 12:54 PM IST
    Follow us on

    Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ కి ఉన్న స్టార్ డమ్ మరే డైరెక్టర్ కి లేదనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలే ఆయనకి అంతటి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా హీరో అంటే ఒక డీసెంట్ పాత్రలో అన్ని మంచి గుణాలతో ఉండాలి, వాడికంటు ఒక పని ఉండాలి, అలాగే అన్యాయం చేసిన వాళ్ళని కొట్టాలి అనే రేంజ్ లో తెలుగు సినిమా కథలు సాగుతు ఉండేవి.

    కానీ హీరో అంటే ఒక ఆకతాయిగా తిరిగేవాడు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు, తనకి కోపం వస్తే కొట్టేవాడు, బాధ వస్తే ఏడ్చేవాడు. అనే విధంగా హీరో క్యారెక్టర్ ను సృష్టించి కూడా సినిమాలు తీయొచ్చు అని చూపించిన ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్. అందుకే ఇండస్ట్రి లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. మహేష్ బాబు కెరీయర్ లోనే మొదటి ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది.

    ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు విపరీతంగా ఎదురుచూశారు. అలాంటి సమయంలోనే బిజినెస్ మెన్ సినిమాతో పూరి మహేష్ బాబుకు మరొక సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ని అందించాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో 50 కోట్ల వసూళ్లను రాబట్టిన సినిమా చేరిపోయింది. అయితే ఈ సినిమా కథ పూరి జగన్నాథ్ గారిది కాదు అనే విషయాన్ని పూరినే స్వయంగా చెప్పాడు. ఒకరోజు వాళ్ల గురువు అయిన రామ్ గోపాల్ వర్మ పూరీకి ఫోన్ చేసి ముంబై లో డాన్ లు ఎవరూ లేరు.

    ఇప్పుడు హీరో డాన్ అవుదామని ముంబై కి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఒక కథ రాయమని చెప్పాడట. దాంతో పూరి బిజినెస్ మెన్ అనే కథ రాసుకొని మహేష్ బాబు తో ఈ సినిమా చేశాడు. ఇక ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ కి చెప్పి నేను మహేష్ బాబు తో ఈ సినిమా చేస్తున్నానని చెబితే, అప్పుడు వర్మ ఇది నువ్వు డెవలప్ చేసిన కథ నా నుంచి లాక్కొని అయిన సినిమా చేసేంత హక్కు నీకు ఉంది అని నవ్వుతూ చెప్పాడట…