HomeతెలంగాణKCR: అసెంబ్లీకి కేసీఆర్.. వస్తారా రారా?

KCR: అసెంబ్లీకి కేసీఆర్.. వస్తారా రారా?

KCR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యాయి. ఉదయం 11:30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో గత వైఫల్యాలను ఎండగట్టారు. భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రణాళికను వివరించారు. ఆరు గ్యారంటీల్లో మరో రెండు త్వరలో అమలు చేస్తామని, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు తెలపడానికి ప్రజాభవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. రైతులు యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. పదేళ్ల గత పాలనలో ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని తెలిపారు.

తొలిరోజు హాజరు కాని కేసీఆర్‌..
ఇక తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్‌ బడ్జెట్‌ సమావేశ తొలిరోజు అసెంబ్లీకి రాలేదు. అందరూ కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారని భావించారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్‌ గత అసెంబ్లీ సమావేశాలకు తుంటి ఎముక గాయం కారణంగా రాలేదు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఇటీవలే అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలతోనూ సమావేశం నిర్వహించారు. దీంతో సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. అయితే కేసీఆర్‌ సమావేశాలకు రాలేద.

10న అసెంబ్లీకి..
కేసీఆర్‌ ఈ సమావేశాలకు వస్తారని తెలుస్తోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు గులాబీ భవన్‌ నుంచి సమాచారం. మొదట అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా రాకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి.. లోక్‌సభకు వెళ్తారని గులాబీ భవన్‌లో చర్చ జరిగింది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడుతుండడంతో కేసీఆర్‌ తన నిర్ణయం మార్చుకున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 10న అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular