Revanth Reddy : ఇటీవల ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. ఆయన ఢిల్లీ టూర్లో కూడా ఇదే విషయాలపై మాట్లాడారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ఏ శాఖల కేటాయిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పారు. సుత్తి లేకుండా అసలు విషయాన్నీ వెల్లడించారు. ” సీనియర్ మంత్రుల శాఖలో ప్రస్తుతానికి మార్పులు లేవు.. వస్తున్నా వద్ద ఉన్న 11 శాఖలలో కొన్నింటిని కొత్త మంత్రులకు ఇస్తాను. నా వద్ద హోమ్, మున్సిపల్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ వంటి కీలకమైన 11 విభాగాలు ఉన్నాయి.. వాటిలో కొన్నిటిని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురికి ఇస్తాను.. అయితే ఇప్పటికే వారికి శాఖల కేటాయింపు జరిగిందని” రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
రేవంత్ వదులుకునేది ఈ శాఖలనేనా?
ముఖ్యమంత్రి వద్ద హోమ్ శాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖలు ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల ఈ మూడు శాఖలను ఆయన ముగ్గురు మంత్రులకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధిష్టానం భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డికి వర్తమానం పంపించి.. హస్తినకు పిలిపించుకుంది. వారితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఫలితంగా శాఖలను వారికి ఇచ్చే విషయంలో అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న 11 శాఖల్లో కీలకమైన మూడింటిని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇస్తారని తెలుస్తోంది..” ముఖ్యమంత్రి దగ్గర 11 శాఖలు ఉన్నాయి. అందులో కీలకమైన శాఖలను ముగ్గురు మంత్రులకు ఇవ్వడానికి అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇదే పూర్తయితే కనుక ఆ శాఖలకు పూర్తిస్థాయిలో మంత్రులు వస్తారు. ఇప్పటికే ఆ శాఖలలో జరుగుతున్న వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఆ శాఖలకు మంత్రులు గనుక వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు.. ఆ శాఖలకు గత బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు కూడా భారీగానే జరిపింది కాబట్టి.. అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి ఆస్కారం ఉంటుందని” కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన వల్లే ముగ్గురు మంత్రులకు శాఖలు వచ్చాయని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మలిదశలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారు.. అందులో ఎంతమంది సీనియర్ నాయకులకు స్థానం కల్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.