Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Maturity Politics: లోకేష్ పరిణితి రాజకీయం.. ప్రత్యర్థులు సైతం హాట్సాఫ్!

Nara Lokesh Maturity Politics: లోకేష్ పరిణితి రాజకీయం.. ప్రత్యర్థులు సైతం హాట్సాఫ్!

Nara Lokesh Maturity Politics: ఏపీ భవిష్యత్తుతో ముడిపడిన నాయకుడు నారా లోకేష్( Nara Lokesh). ఇంతింతై వటుదింతై అన్నట్టు నారా లోకేష్ తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఇబ్బందులతోపాటు చిక్కుముళ్లను అధిగమించి భావి నాయకుడిగా ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర చాటుకున్నారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీని నడిపించే సైనికుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. టిడిపిని నడిపించే భావి నాయకుడిగా పార్టీలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోగలిగారు. ప్రభుత్వంలో సైతం కీలక పాత్ర పోషిస్తూ.. ప్రజలకు సుపరిపాలన అందిస్తూ.. నిజమైన నాయకుడు ఇలా ఉండాలి అనే మాదిరిగా ప్రత్యర్థుల నుంచి సైతం అభినందనలు అందుకున్న నేత నారా లోకేష్.

ప్రత్యర్ధులు అభినందించేలా
నారా లోకేష్ అంటే ఒక వ్యక్తి కాదు.. శక్తి అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. మొన్నటి వరకు రాజకీయాలు( politics) తెలియవు.. సమర్ధుడు కాదు అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఏం రాజకీయాలు చేస్తున్నారు రా అంటూ ప్రత్యర్థుల సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు నారా లోకేష్. ప్రస్తుతం రెడ్ బుక్ క్రియేటర్ గా ప్రతిపక్ష పార్టీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు లోకేష్. లోకేష్ 1.0 ఒక ఎత్తు.. 2.0 అన్నది మరో ఎత్తు అన్నట్టు విశ్వరూపం చూపిస్తున్నారు. ఈ రోజున ఆయన పార్టీలో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రి చంద్రబాబును అనుసరిస్తూనే పాలిటిక్స్ లో తనకంటూ ఒక కొత్త వరవడిని సృష్టించుకున్నారు. తండ్రి ఐటి అంటే కుమారుడు వాట్సాప్ గవర్నెన్స్ ని తెచ్చారు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

పాలన పట్ల అవగాహన
నారా లోకేష్ ను నిశితంగా పరిశీలిస్తే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్( maturity levels) గణనీయంగా పెరిగాయి అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆయన ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు. లోకేష్ ప్రసంగాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే తెలుగుదేశంలో భావి నాయకుడిగా లోకేష్ కీర్తించబడుతున్నారు. లోకేష్ ఇంటా గెలిచారు.. రచ్చ కూడా గెలుస్తున్నారు. అటు బిజెపి అగ్రనాయకత్వం సైతం లోకేష్ విషయంలో సానుకూలత ప్రదర్శిస్తోంది. ఏ నోటితో అయితే లోకేష్ వారసత్వ రాజకీయం పై మాట్లాడారో.. అదే నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విందుకు పిలిచారంటే లోకేష్ పరిమితి ఏ స్థాయిలో పెరిగిందో గుర్తుచేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే లోకేష్ టిడిపి భావి నాయకుడు. అందులో ఎంతవరకు అనుమానం లేదు. కానీ ఆయన కూటమిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు మాత్రం అభినందనలు అందుకుంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular